Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

రష్యా గ్యాస్‌ పైప్‌లైన్‌లో కొత్త లీక్‌: స్వీడన్‌

రష్యన్‌ సహజ వాయువును బాల్టిక్‌ సముద్ర మార్గం ద్వారా జర్మనీకి తీసుకువెళ్లే ప్రధాన పైప్‌లైన్‌ నార్డ్‌స్ట్రీమ్‌1, 2 లో స్వీడన్‌ కొత్త లీక్‌లు కలవరపెడుతున్నాయి. ఇది ఈ వారంలో కనుగొన్న నాల్గవది. డెన్మార్క్‌, స్వీడన్‌ ఈ వారం ప్రారంభంలో నార్డ్‌ స్ట్రీమ్‌ 1,2 పైప్‌లైన్‌లలో గ్యాస్‌ లీక్‌లను గుర్తించింది. అయితే ఈ లీకేజీలు ‘‘ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యపూరితంగా, బాధ్యతారహితమైన విధ్వంసక చర్యల’’ ఫలితమేనని నాటో వాదన. వాతావరణముప్పుకు కారణమని అందోళన వ్యక్తంచేసింది. భారీ పేలుళ్లవల్లే ఈ లీకేజీలు సంభవించాయని శాస్త్రవేత్తల అంచనా. క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ, లీకేజీల గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని, ఉద్దేశపూర్వ కంగా దాడి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతిచ్చినందుకు ప్రతీకారంగా రష్యా గ్యాస్‌ సరఫరాను పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగిస్తోందని నాటో ఆరోపణ. నార్డ్‌ స్ట్రీమ్‌ 1,2 గ్యాస్‌ను రవాణా చేయడం లేదు, అయినప్పటికీ అవి రెండూ గ్యాస్‌ను కలిగి ఉన్నాయి. నార్డ్‌స్ట్రీమ్‌ 1 సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సమీపంలోని రష్యన్‌ తీరం నుండి ఈశాన్య జర్మనీ వరకు బాల్టిక్‌ సముద్రం క్రింద 1,200 కిమీ (745 మైళ్ళు) విస్తరించి ఉంది. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత నార్డ్‌ స్ట్రీమ్‌ 2 నిలిపివేయడమైంది. బాల్టిక్‌ సముద్రం ఉపరితలం వద్ద 1కిమీ వ్యాసం కలిగిన బుడగలు కనిపించే లీక్‌ల ఫుటేజీని డెన్మార్క్‌ డిఫెన్స్‌ కమాండ్‌ విడుదల చేసింది. ఈ లీకేజీల ద్వారా విడుదలయ్యే వాయువు వాతావరణంపై ప్రభావం చూపడంతోపాటు సముద్రజీవులకు కూడా ముప్పుగా మారనుంది. పైప్‌లోని మీథేన్‌ వాతావరణ ప్రభావం దాదాపు 2.5 గంటల ప్రపంచ కర్బన ఉద్గారాలకు సమానం కావచ్చని ఒక అమెరికన్‌ శాస్త్రవేత్త అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img