కో ఎడ్యుకేషన్ నిషేధం
కాబూల్ : కాబూల్ విమానాశ్రయం రాకెట్ల దాడులతో దద్దరిల్లుతోంది. కాబూల్ విమానా శ్రయం లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగి నట్లు తెలుస్తోంది. అమెరికా జరిపిన డ్రోన్ దాడులను తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహుదీన్ ఖండిరచారు. ఏకపక్ష నిర్ణయాలతో ఈ విధంగా దాడులు చేయడం సరికాదన్నారు. అమెరికా భద్రతాదళాలు అఫ్గాన్ నుంచి ఉపసం హరించుకోవడానికి 48 గంటలకంటే తక్కువ సమయం ఉంది. సోమవారం ఉదయం రాకెట్లు విమానాశ్రయం వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడిరచారు. వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చివేసినట్లు తెలుస్తోంది.ఖోర్షిద్ ప్రవైటు యూనివర్సిటీ సమీపంలోని ఓ వాహనం నుంచి ఈ రాకెట్ల దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులోని క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని నిర్వీర్యం చేయడంతో సలీంకార్వాన్ ప్రాంతంలో కూలిపోయాయి. మొత్తం 5 రాకెట్లు ప్రయోగిం చినట్లు సమాచారం. పేలుడు శబ్దాలకు విమానా శ్రయంలో ఉన్నవారు భయాందోళనలతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు వద్ద కిలోమీటరు దూరంలో ఆదివారం రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వద్ద ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్ దాడి ద్వారా మట్టుపెట్టారు. అమెరికా భద్రతా దళాల ఉపసంహరణ మంగళవారంతో ముగియనుంది.
మత గురువును అరెస్టు : అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రముఖ మత గురువు మౌల్వీ మహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు ఒక ఫోటోను విడుదల చేశారు.
కో ఎడ్యుకేషన్ నిషేధం : తాజాగా తాలిబన్లు దేశవ్యాప్తంగ కో ఎడ్యుకేషన్‌పై నిషేధం విధిం చారు. బాలికలకు పురుషుల విద్య చెప్పకూడదని హుకుం జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం విద్యాసంస్థల కార్యకలాపాలు కొనసాగాలని అఫ్గాన్ ఉన్నత విద్యా శాఖమంత్రి హక్కానీ స్పష్టంచేశారు. దీనికి ప్రజలు, ఉపాధ్యాయులు భరోసాగా ఉండాలన్నారు.
అఫ్గాన్ వీడిన బ్రిటీష్ సైనికులు
అమెరికాతో కలిసి బ్రిటన్ అఫ్గాన్‌పై దండెత్తి ఏమీ సాధించలేకపోయింది. ఈ నెల 31లోగా అమెరికా, బ్రిటన్,నాటో దళాలు ఉపసంహరించు కోపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని తాలి బన్లు హెచ్చరించిన నేపధ్యంలో గడువుకు రెండు రోజులముదే బ్రిటిష్ సైనిక పటాలం కాబూల్ నుంచి ఖాళీచేసింది. అమెరికా మినహా చాలా దేశాలు తమ దళాలను ఇప్పటికే స్వదేశం రప్పించుకున్నాయి. అఫ్గాన్‌లో బ్రిటిష్ రాయబారి మాట్లాడుతూ.. ఆపరేషన్ దశను ముగిస్తున్నామన్నారు.