Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

‘రెడ్‌ఆర్మీ’ స్మారకాన్ని తొలగించొద్దు

బల్గేరియాలోని సోఫియా ప్రజల భారీ నిరసన ప్రదర్శన

సోఫియా: బల్గేరియాలోని సోఫియాలోగల సోవియట్‌ రెడ్‌ఆర్మీ స్మారకాన్ని వేరొక చోటకు తరలించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని స్థానిక అధికారులకు అక్కడి ప్రజలు తేల్చిచెప్పారు. అందుకు తాము ఒప్పుకోబోమని స్పష్టంచేశారు. అరుణ పతాకాలు, బల్గేరియన్‌ జెండాలతో రోడ్లపైకొచ్చి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రదర్శనలు, మానవహారాల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేశారు. రెడ్‌ఆర్మీ స్మారకం తరలింపు ఆలోచన మానుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఈ స్మారకం రాజధాని మధ్యలోని నేషనల్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ కల్చర్‌, సెంట్రల్‌ పార్క్‌ వద్ద ఉంది. ఈ స్మారకం ప్రభుత్వఆస్తి కావడంతో ప్రభుత్వ సహకారం, అనుమతి లేకుండా దీనిని తొలగించడం లేదా తరలించే అధికారం సిటీ కౌన్సిల్‌కు లేదు. నాజీల నుంచి సోఫియాకు విమోచనం కల్పించిన సోవియట్‌ అరుణసైన్యం గౌరవార్థం ఈ స్మారకాన్ని 1954లో ఏర్పాటు చేశారు. ‘సోవియట్‌ లార్మీ లిబరేట్లర్లకు`బల్గేరియా ప్రజల నుంచి కృతజ్ఞతగా’ అని స్మారకంపై ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img