Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

‘రేడియోయాక్టివ్‌ సుమానీ’
డ్రోన్‌ ప్రయోగించిన ఉ.కొరియా

. ఫ్రాన్‌లో తీవ్రస్థాయికి ప్రజాందోళన
. రోడ్లపైకొచ్చిన పది లక్షల మంది
. 457 మంది అరెస్టు
. 441 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
. నిరసనలతో అట్టుడికిన దేశం
. 28న పదోసారి దేశవ్యాప్త నిరసన

పారిస్‌: రిటైర్మెంట్‌ వయస్సు తగ్గించాల్సిందేనని ఫ్రాన్స్‌ ప్రజలు తమ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి చేర్చారు. పదిలక్షల మందికిపైగా రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో జనవరి నుంచి నిరసనలతో ఫ్రాన్స్‌ అట్టుడికిపోతోంది. రాజధాని పారిస్‌ లోనే 1,19,000 మంది కవాతు నిర్వహిం చారు. నిరసనకారులు రోడ్లను దిగ్బంధిం చారు. కొన్ని చోట్ల హింస జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64 ఏళ్లకు పెంచాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ బిల్లును తీసుకురావడం, దానిని ఓటింగ్‌ లేకుండా పార్లమెంటు ఆమోదించడంతో కార్మికప్రజాఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి. అనేక చోట్ల నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణతో హింసాత్మక వాతావరణం నెలకొంది. 1,19,000 మంది కవాతు నిర్వహించడం పారిస్‌ చరిత్రలో లేదని దేశ అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపింది. 457 మంది అరెస్టు కాగా 441 మంది భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గెరాల్డ్‌ దర్మనిన్‌ వెల్లడిరచారు. ఆయన శుక్రవారం ఉదయం ఓ వార్తాఛానల్‌తో మాట్లాడుతూ పారిస్‌ వీధుల్లో 903 చోట్ల నిరసనకారులు నిప్పు పెట్టారన్నారు. భారీస్థాయిలో ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయని, హింస చోటుచేసుకుందని, పారిస్‌ మొత్తం అట్టుడికిపోయిందని చెప్పారు. మరోవైపు పోలీసులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. హింస కారణంగా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నేను అనుకోవడం లేదు. ప్రజాస్వామిక, సామాజిక చర్చకు అంగీకారం తెలుపాలేగానీ హింసాత్మక చర్చకు కాదు’ అని ఆయనన్నారు. పశ్చిమ ఫ్రాన్స్‌ నగరాలైన నాంటెస్‌, రెన్నెస్‌, లోరియంట్లో నిరసనకారులు కదం తొక్కారు. లోరియంట్‌ సిటీలోని ఓ పరిపాలనా భవనంపై నిరసన కారులు దాడికి పాల్పడ్డారు. అక్కడి పోలీస్‌ స్టేషన్‌ను తగులబెట్టారు.
నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు. దేశవ్యాప్తంగా 3.5 మిలియన్ల మందికిపైగా నిరసనల్లో పాల్గొన్నట్లు అతిపెద్ద యూనియన్‌ ‘సీజీటీ’ నివేదించింది. పారిస్‌లో 1,20,000 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలుపగా 8,00,000 మంది పాల్గొన్నారని యూనియన్‌ తెలిపింది. ప్లేస్‌ డె లా రిపబ్లికా వద్ద నిరసన కారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు వును పోలీసులు వాడినట్లు ఎ రియా నోవోస్టి ప్రతినిధి వెల్లడిరచారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించారని, జల ఫిరంగులనూ ప్రయోగిం చారని చెప్పారు. ఈనెల 28వ తేదీన 10వ దేశవ్యాప్త ఆందోళన జరుగుతుందని దేశంలోని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఇదిలావుంటే పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలను ప్రధాని ఎలిజబెత్‌ బార్నె ఖండిరచారు. ‘ఇంతటి హింస, విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. పోలీసులు, అత్యవసర సేవలు తగు చర్యలు తీసుకున్నందుకు వారికి కృతజ్ఞురాలిని’ అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img