క్యూబా, జపాన్ సంకల్పం
హవానా: తమ సహకార బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని క్యూబా, జపాన్ దేశాలు సంకల్పించాయి. క్యూబా ఉపప్రధాని, విదేశీ వాణిజ్య మంత్రి రికార్డో కబ్రిసాస్, జపాన్ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోషిమిట్సు మొటేగిల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. మొటేగి పర్యటన ఓ మైలురాయి అని క్యూబా ప్రతినిధి అన్నారు. ద్వీపదేశాన్ని మొదటిసారి సందర్శించిన మొటేగి తన పర్యటనపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఉన్నతస్థాయి సమావేశాల సమావేశాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడిరచారు. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూరో రోడ్రిగ్స్‌ను ఆయన కలిశారు. పరస్పర బంధాల పురోగతిని శ్లాఘించారు. వీటిని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. రాబోయే డిసెంబరు నాటికి జపాన్, క్యూబా మధ్య దౌత్య బంధానికి 94ఏళ్లు అవుతాయి.