Friday, December 2, 2022
Friday, December 2, 2022

హజ్‌ యాత్రీకుల భద్రతకు మహిళా సైనికులు

హజ్‌ : సౌదీ అరేబియాలో మహిళా సాధికా రతను ప్రోత్సహించడం కోసం ఆ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సౌదీ హజ్‌ సందర్శన సందర్భంగా మహిళా సైనికులు మోహరించారు. ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హజ్‌యాత్రికులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తొలిసారిగా మహిళా యాత్రికుల కోసం భద్రతా సేవను చేపట్టారు. వారు మక్కా, మదీనాలోని పవిత్ర ప్రదేశాలలో విధులు నిర్వహిస్తు న్నారు. పొడవైన జాకెట్‌, వదులుగా ఉన్న ప్యాంటుతో ఖాకీ యూనిఫాం ధరించారు. జుట్టును కప్పడానికిగాను టోపీ ఉపయోగించారు. మక్కాలో పోస్ట్‌ చేసిన మొదటి మహిళా సెక్యూరిటీ గార్డు పేరు మోనా. తన తండ్రి ప్రేరణతో సైన్యంలో చేరినట్లు ఆమె పేర్కొంది. కాబాలో పోస్ట్‌ చేపట్టిన మహిళ మాట్లాడుతూ..ఈ పవిత్రస్థలాన్ని సందర్శించే యాత్రికుల భద్రత కోసం తనను నియమించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img