Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంగోలా ఎన్నికల్లో అధికార పార్టీ విజయ సంకేతం

అంగోలా : అంగోలా సార్వత్రిక ఎన్నికల తాత్కాలిక ఫలితాలు అధికార పార్టీ విజయం దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. దాదాపు 50 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మూవ్‌మెంట్‌ ఫర్‌ ది లిబరేషన్‌ ఆప్‌ అంగోలా (ఎంపీఎల్‌ఏ) దేశాన్ని పాలిస్తోంది. 86శాతం ఓట్ల లెక్కింపుతో ఎంపీఎల్‌ఏ 52.08 శాతం ఓట్లు నమోదుకాగా, ప్రతిపక్ష నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది టోటల్‌ ఇండిపెండెన్స్‌ ఆఫ్‌ అంగోలా (యూఎన్‌ఐటీఏ) 42.98శాతం ఓట్లను నమోదుచేసింది. దశాబ్దాల కాలంలో అత్యంత గట్టిపోటీని ఎదుర్కొన్న ఎన్నికలుగా ఈ ఎన్నికలను పరిగణించవచ్చు. 1975లో పోర్చుగల్‌ నుంచి అంగోలా స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఎంపీఎల్‌ఏ అధికారంలో ఉంది. దీనికి గత ఐదేళ్లుగా ప్రస్తుత అధ్యక్షుడు జోవో లౌరెంకో నాయకత్వం వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ యుఎన్‌ఐటీఏ అడాల్బెర్టో కోస్టా జూనియర్‌ నేతృత్వంలో ఉంది. దాదాపు 60శాతం మంది ఓటర్లు 25 ఏళ్లలోపు వారే వీరు మొదటిసారి ఓటు వేస్తున్నారు. మరో ఆరు పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచాయి. 1992లో తొలిసారిగా అంగోలాలో బహుళ పార్టీ ఎన్నికలు ప్రవేశపెట్టడమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img