Friday, April 19, 2024
Friday, April 19, 2024

అణుదాడికి సిద్ధంగా ఉండండి
సైన్యానికి కిమ్‌ ఆదేశం

ప్యోంగ్యాంగ్‌: అమెరికా, దక్షిణకొరియాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అణు దాడికి సిద్ధంగా ఉండాలంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ సైన్యాన్ని కోరారు. ఈ మేరకు అమెరికాదక్షిణ కొరియాలపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని సైనికాధికారులకు ఆదేశాలందాయి. ఈ విషయాన్ని ఉత్తరకొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ సోమవారం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికాదక్షిణ కొరియా వ్యూహాత్మక దళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాన్ని కిమ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు రెండు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యాన్ని ఆదేశిం చారు. డమ్మీ అణువార్‌ హెడ్‌తో ఉత్తర కొరియా ఆదివారం ఓ బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 800 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని తాకింది. అమెరికా, దక్షిణ కొరియాకు బలమైన సంకేతం పంపేందుకే ఈ క్షిపణిని ప్రయోగించింది. యుద్ధంలో ప్రతిదాడి చేయడానికి, అణు ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించు కునేందుకు ఈ కసరత్తు చేసినట్లు కేసీఎన్‌ఏ వెల్లడిరచింది. ఈ ప్రయోగాలపై కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా, అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఫ్రీడమ్‌ షీల్డ్‌ పేరుతో 11 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో స్ట్రాటజిక్‌ బాంబర్లను వినియోగించడంతో వీటికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా అణుప్రతిదాడులపై దృష్టి సారించింది. ఇటీవల ఉత్తర కొరియా ఒకే రోజున నాలుగు క్షిపణులను పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన క్షిపణి పరీక్షను వీక్షించేందుకు కిమ్‌ తన తొమ్మిదేళ్ల కుమార్తె కిమ్‌ జుఏతో కలిసి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img