Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అణు ఒప్పంద పునరుద్ధరణకు ఐఏఈఏ, ఇరాన్‌ ఒప్పందం

టెహ్రాన్‌ : అణు ఒప్పంద సంక్షోభ నివారణకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ), ఇరాన్‌ ఆదివారం ఒప్పందాన్ని కదుర్చుకున్నాయి. 2015 అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశాలపై నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకుగాను ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఐఏఈఏ డైరెక్టర్‌ రాఫెల్‌ గ్రోసి ఇరాన్‌లో పర్యటనలో భాగంగా టెహ్రాన్‌లో ఇరాన్‌ అటామిక్‌ ఎనర్జీ ఆర్గనైజేషన్‌కు చెందిన మొహమ్మద్‌ ఎస్లామితో భేటీ ఆయ్యారు. ఇరు పక్షాల సమావేశం నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ నెలాఖరులో వియన్నాలో జరిగే సమావేశంలో సంబంధిత చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అమెరికా ఏకపక్ష ఆంక్షలను ఎత్తివేసే క్రమంలో భాగంగా వియన్నాలో జరిగే చర్చలు ఆధారపడి ఉన్నాయని ఇరాన్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img