Friday, April 19, 2024
Friday, April 19, 2024

అప్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి

అప్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్లో మళ్లీ బాంబు పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ పేలుడు రష్యా రాయబార కార్యాలయం దగ్గర సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది.అప్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది. రష్యా రాయబార కార్యాలయం దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అందులో ఇద్దరు దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. అయితే ఈ దాడిలో మరికొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. వీసాల కోసం ఎదురుచూస్తున్న దౌత్యకార్యాలయ గేట్ల దగ్గర సోమవారం ఈ పేలుడు జరిగింది.
తాలిబాన్‌లు ఒక సంవత్సరం క్రితం దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తున్న అతికొద్ది దేశాలలో రష్యా ఒకటి. మాస్కో అధికారికంగా తాలిబాన్‌ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, వారు గ్యాసోలిన్‌, ఇతర వస్తువులను సరఫరా చేసే ఒప్పందంపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆత్మాహుతి దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా శుక్రవారం ప్రార్థనల సమయంలో వాయువ్య ఆఫ్ఘనిస్తాన్‌లోని మసీదులో జరిగిన పేలుడులో కనీసం 20 మంది మరణించిన రెండు రోజుల తర్వాత ఈ పేలుడు జరిగింది. హెరాత్‌ నగరంలోని గుజార్ఘా మసీదులో మధ్యాహ్నం 12:40 గంటలకు బాంబు దాడి జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img