Friday, April 19, 2024
Friday, April 19, 2024

అఫ్గాన్‌ను వీడిన అమెరికా సైన్యం

సంబరాల్లో తాలిబన్లు
వాషింగ్టన్‌ : అఫ్గాన్‌లో అమెరికా పోరు ముగిసింది. గడువుకు ఒక్క రోజు ముందుగానే అమెరికా యుద్ధ విమానాలు అఫ్గాన్‌ విడిచి వెళ్ల్లాయి. దీనితో తాలిబన్లు సంబరాలు చేసుకు న్నారు. ఆగస్టు31 గడువులోపు అమెరికా దళాలు అఫ్గాన్‌ను ఖాళీ చేశాయని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని యుఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ హెఢ్‌ జనరల్‌ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు. సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సి`17 కాబూల్‌లోని హమీద్‌ కార్జాయ్‌ విమానాశ్రయం నుంచి సోమవారం అర్థరాత్రి బయలుదేరింది. దీనితో అఫ్గాన్‌లోని సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది. 20ఏళ్ల అనంతరం అమెరికా దళాలు అఫ్గాన్‌ను వీడడంతో తాలిబన్లు తుపాకులు గాల్లోకి పేల్చారు. ఈ సందర్భంగా తాలిబన్‌ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ ఈ రోజు తమకు సంపూర్ణ స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. తాలిబన్‌ అధికార ప్రతినిధి హక్కాని మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక క్షణాల్లో ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
తాలిబన్‌ నాయకులు కవాతు
అఫ్గాన్‌ నుండి చివరి విదేశీ దళాలు వైదొలగిన కొన్ని గంటల తర్వాత తాలిబన్‌ నాయకులు కాబూల్‌ విమానాశ్రయం గుండా కవాతుచేశారు. తాలిబన్‌ ప్రతినిధి ముజాహిద్‌ అధికారుల బృందాన్ని రన్‌వేపైకి నడిపించారు. అఫ్గాన్‌కు అభినందనలు ఈ విజయం మనం దరిదీ అని ముజాహిద్‌ విలేకరులతో అన్నారు. అమెరికా ఓడిపోయింది. సైనిక కార్యకలాపాల ద్వారా వారు తమ లక్ష్యాలను సాధించలేకపోయా రన్నారు. అగస్టు 15న తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటినుండి విమానాశ్రయం అస్తవ్యస్తంగా మారింది. అమెరికా మిత్ర దేశాలు 100,000 మందికిపైగా విమానాల్లో తరలించారు. విమానాశ్రయ కార్యకలాపాలు చేపట్టడానికి తాలిబన్లు టర్కీతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా మిలిటరీ అనేక విమానాలు, సాయుధవాహనాలు, హైటెక్‌ రాకెట్‌ రక్షణ వ్యవస్థను విమానాశ్రయంలో నిలిపివేసినట్టు యుఎస్‌ జనరల్‌ తెలిపారు.
తాలిబన్లతో భారత రాయబారి చర్చలు
భారత్‌తో తాలిబన్ల సంబంధాలు నూతన అధ్యాయం చోటుచేసుకుంది. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబన్‌ప్రతినిధి అబ్బాస్‌ మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. తాలిబన్ల కోరిక మేరకే ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. భారత్‌ లేవ నెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్క రిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారు. ఆఫ్గాన్‌ను భారత వ్యతిరేక కార్యకలా పాలకు ఉగ్రవాద చర్యలకు ఉపయోగించ రాదని మిట్టల్‌ తాలిబన్లను కోరారు. అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, తరలింపు వంటి అంశాలపై ప్రధానంగాదృష్టి సారించినట్లు సమాచారం. భారత్‌తో వాణిజ్యసంబంధాల కొనసాగింపు, తమ వల్ల భారత్‌కు ముప్పు ఉండదని ప్రకటించడమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img