Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అఫ్గాన్‌లో ఆకలికేకలు

హవానా : అఫ్గాన్‌లో అమెరికా సామ్రాజ్యవాద దురహంకార ప్రభావం ఆక్కడి ప్రజలకు నిట్ట నీడలేకుండా చేస్తోంది. అఫ్గాన్‌ వాసుల జీవిత గమనాన్నే మార్చేసింది. అఫ్గాన్‌లో సంక్షోభం ఏర్పడిరదని ఐక్యరాజ్యసమితి ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటురంగంలోని ఎంతోమంది ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల క్షుద్బాధ తీరే దారిలేక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వచ్చిన రేటుకు అమ్మేసే పరిస్థితి ఏర్పడిరది. కాబూల్‌ వీధులు సంతలను తలపిస్తున్నాయి. అన్ని వస్తువు లను వచ్చిన ధరకే అమ్మేస్తున్నారు. 25వేల అఫ్గానీల పెట్టి కొనుక్కున్న రిప్రిజిరేటర్‌ను 5వేలకు అమ్మేస్తు న్నారు. లక్షలుపోసిన వస్తువులను వేలకే విక్రయిస్తు న్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అక్కడి రోడ్లపై అమ్మకాలకు పెట్టిన పరిస్తితి. కుటుంబ సభ్యుల ఆకలితీరిస్తేచాలన్నట్లు టీవీలు, ఫ్రిజ్‌లు, అల్మారాలు, అన్నీ రోడ్లపైనేఉన్నాయి, తాలిబన్లు కాబూల్‌ను చేపట్టి నెలరోజులు కావస్తున్నా..ఆర్థిక సమస్యలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. పాలనా ఇంకా పట్టాలెక్క కపోవడంతో అంతా అరాచ కంగా ఉంది. ఆర్థిక సమస్యలతోపాటు ఆహారకొరత కూడా ఆ దేశాన్ని అతలా కుతలంచేస్తోంది. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద ఉంచిన ఆహార నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐరాస హెచ్చరించింది. దీనిబట్టి చూస్తుంటే అఫ్గాన్‌వాసులు మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది.
స్త్రీలను పశువుల్లాగా చూస్తున్నారు
అఫ్గాన్‌లో తాలిబన్లు మహిళలను పశువులకన్నా హీనంగాచూస్తున్నారు. మహిళలను గొంతెత్త నివ్వడంలేదు. అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆఫ్గాన్‌ మాజీ పార్లమెంటుసభ్యురాలు పింకాయ్‌ ఆవేదన వెలిబుచ్చారు. అఫ్గాన్‌మహిళలు తమ కాళ్లపై తామునిలబడేందుకు కృషిచేశారు. ఇప్పుడిదంతా నిర్వీర్యమైందని పాత్రికేయురాలు ఫాతిమా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img