Friday, April 19, 2024
Friday, April 19, 2024

అఫ్గాన్‌లో ఆహార సంక్షోభం

కాబూల్‌ : అఫ్గాన్‌లో తీవ్ర మానవ సంక్షోభం ఏర్పడిరదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 10 మిలియన్ల మంది బాలబాలికలకు మనవతాసహాయాన్ని కోరుతున్నారని పేర్కొంది. ప్రతి ఒక్క దేశం సహాయం చేసి ఆ దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చింది. తన వంతుగా ఆర్థిక సహాయం ప్రకటించింది. కొంతమంది డబ్బుల కోసం తమ దగ్గర ఉన్న సామాన్లను అమ్ముకోవడానకి సిద్ధమైనా కొనేవారులేరు. ప్రపంచ ఆహార సంస్థ నివేదిక ఆధారంగా 40శాతం పంటలు నష్టపోయాయి. గోధుమల ధరలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 30 సంవత్సరాల నుంచి అఫ్గాన్‌లు ఏదో ఒక యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. యుద్ధాల వల్ల అత్యధికులు ఆహారం, తాగునీరు కోసం స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడి జీవిస్తున్నారు. వానలు లేక 34జిల్లాలో కరవు తాండవిస్తోంది. శీతాకాలం సమీపిస్తున్నందున ఆహార సరఫరా పూర్తి అయిపోతుందనే అందోళననలు విస్త్రతంగా ఉన్నాయి. అఫ్గాన్‌ జనాభాలో 70శాత గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలోని 34రాష్ట్రాల్లో 7.3 మిలియన్లమంది కరవుతో బాధపడుతున్నారు. నగరాల్లో పోలీసు, పౌర సేవకుల వంటి వారి వేతనాలు జులైనుండి చెల్లించడంలేదని తాజా సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img