Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అఫ్గాన్‌లో చీకటి శకం

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి అమెరికా చేసిన ఘోర తప్పిదమే కారణమని అఫ్గాన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్‌లు వైట్‌హౌస్‌ ఎదుట ‘చరిత్ర పునరావృతం చేయవద్దు’ అన్న ప్లకార్డులు పట్టుకుని నినదించారు. ‘తాలిబన్లు ఉగ్రవాదులు’ ‘అఫ్గాన్‌లను చంపడం ఆపండి’ అంటూ అమెరికాలోని అఫ్గాన్‌ వాసులు దిక్కులు దద్దరిల్లేలా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైడెన్‌ తీసుకున్న నిర్ణయం అసమంజమని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేవారు. బైడెన్‌ మీరు మమ్మల్ని మోసం చేశారు. మీరే బాధ్యులు అంటూ నినదించారు. ఇది చీకటి శకం ప్రారంభం అని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో మహిళలకు భవిష్యత్తు ఉండదు..తాము మళ్లీ ఆంక్షల మధ్య జీవించాలనుకోవడం లేదు..ఇది స్వేచ్ఛకాదు..అంటూ అఫ్గాన్‌ మహిళలు పెద్దపెట్టున నినదించారు. చాలామంది అఫ్గాన్‌లో ఉంటున్న తమ కుటుంబసభ్యుల క్షేమ సమాచారంకోసం ఆందోళన వ్యక్తం చేశారు. నా కుటుంబంలో కొందరు ఇరాన్‌కు పారిపోయారు. మరికొందరు ఇళ్లలో బందీలయ్యారని నిరసన నిర్వాహకురాలు నాజిలా జమ్‌షిది వెల్లడిరచారు. అఫ్గాన్‌ పరిస్థితిపై బైడెన్‌ నోరుమెదపకపోవడంతపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌మీడియాలో కూడా ఆయన స్పందించడంలేదు. బైడెన్‌ ఎలా స్పందించాలనేదానినై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. బైడెన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అఫ్గాన్‌ పరిస్థితులు దిగజారడానికి, సరిహద్దులో దుస్థితికి, ఆర్థికవ్యవస్థ దిగజారడానికి బైడెన్‌ కారణమని దుయ్యబట్టారు.
అఫ్గాన్‌లో ముగిసిన యుద్ధం
కాబూల్‌ : ‘అఫ్గానిస్తాన్‌్‌లో యుద్ధం ముగిసిందని దేశం తమ నియంత్రణలో ఉందని’ తాలిబన్‌ ప్రకటించింది. తాలిబన్‌్‌ల పాలనావిధానం, వ్యవహారాలు త్వరలో స్పష్టమవుతాయని తాలిబన్‌ ప్రతినిధి మొహమ్మద్‌ నయీం మీడియాకు తెలిపారు. అఫ్గాన్‌ ప్రజలకు ఈ రోజు గొప్ప రోజుఅని పేర్కొన్నారు. అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోవడంతో కాబూల్‌లోని అఫ్గాన్‌ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రక్రియను ప్రారంభిస్తామని, తాము శాంతియుతంగా దేశాన్ని పాలిస్తామని, ఒంటరిగా పాలించాలను కోవడంలేదని నయూమ్‌ పేర్కొన్నారు. షరియా చట్టంలో మహిళలు, బాలికల హక్కులకు, భావప్రకటనా స్వేచ్ఛకు తాలిబన్లు గౌరవిస్తామని అన్నారు. దేశంలోని పౌరులు, సంస్థలతో తాము సంప్రదింపులకు సిద్ధమేనని అన్నారు. వారికి రక్షణ చర్యలు కల్పిస్తామన్నారు. ఇతర దేశాల వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తాలిబాన్‌ నూతన ఇస్లామిక్‌ఎమిరేట్‌ను ప్రకటిస్తామన్నారు.ఏ దౌత్యం కార్యాలయాలను, ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోలేదన్నారు. పౌరులకు, దౌత్య కార్యకలాపాలకు భద్రత కల్పిస్తామని నయీమ్‌ పేర్కొన్నారు.
సయోధ్యకావాలన్న ఇరాన్‌
అఫ్గాన్‌లో జాతీయ సయోధ్యకోసం ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం పిలుపునిచ్చారు. ఆఫ్గాన్‌లో స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు ఇరాన్‌ మద్దతు ఇస్తుందని రైసీ పేర్కొన్నట్లు అధికారిక న్యూస్‌ ఏజన్సీ ఇర్నా వెల్లడిరచింది ఇరాన్‌కు ఆఫ్గాన్‌ పొరుగదేశమని, సోదరుడుగా రైసీ అభివర్ణించారు. అమెరికా ఉపసంహరణను సైనిక వైఫల్యంగా రైసీ పేర్కొన్నారు. ఇది జీవితం..భద్రత, శాంతిని పునరుద్ధరణకు ఇదొక అవకాశంగా వెల్లడిరచారు.
అఫ్గాన్‌ స్థితికి అమెరికానే కారణం : జర్మనీారణం అమెరికానే..జర్మనీ
కాబూల్‌: అఫ్గాన్‌లో నెలకొన్న ప్రస్తుత దారుణమైన పరిస్థితికి అమెరికానే కారణమని జర్మనీ పేర్కొంది. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన 10వేల మందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెర్కెల్‌ తెలిపారు. 2500 మంది ఆఫ్గాన్‌ సహాయక సిబ్బందితోపాటు మానవహక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, దేశంలో ఉంటే ముప్పుతప్పదని ఆవేదన వ్యక్తం చేవృారు. అమెరికా కుటిల యత్నాలే అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు.
సంయమనం పాటించాలని యుఎన్‌ చీఫ్‌ విజ్ఞప్తి
అఫ్గాన్‌ తాలిబన్లకు వశం కావడంతో స్థానిక పౌరులజీవనం, వారి హక్కుల విషయంలో ప్రపంచ దేవాల్లో ఆందోళన నెలకొంది. యుఎన్‌ చీఫ్‌ అంటోనియో గుటెర్రస్‌ అఫ్గాన్‌ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలన మధ్య సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు కష్టపడి సాధించిన ఫలాలను కాపాడాలని గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. కర్కశ చట్టాలు, కఠిన నిబంధనలతో మానవ హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ సంక్షోభంపై గుటెర్రస్‌ ప్రజల్ని సంయమనం పాటించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img