Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అఫ్గాన్‌లో ప్రజా పోరాటానికి కేకేఈ తోడ్పాటు

ఏథెన్స్‌ : అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న కల్లోల పరిణామాలను కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ) తీవ్రంగా పరిగణించింది. యుఎస్‌, నాటో వారి సామ్రాజ్యవాద మిత్ర దేశాల జోక్యంతో అఫ్గాన్‌లో ఏర్పడిన తోలుబొమ్మ ప్రభుత్వం పతనం తరువాత అఫ్గాన్‌ పరిస్థితిపై తాజాగా ప్రకటన విడుదల చేసింది. పెట్టుబడీదారీ దేశాలు అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితిని వేరే కోణంగా చూపిస్తున్నా యని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2001లో అమెరికా సామ్రాజ్యవాదజోక్యం, టెర్రరిజంపై పోరాటం, ట్విన్‌టవర్స్‌పై దాడి సాకుతో అమెరికా అఫ్గాన్‌లో తిష్టవేసేందుకు పూనుకుంది. ఆర్థిక వనరులపై పొదుపు సాకుతో పశ్చిమాసియాలో ‘అస్థిర వాతావరణాన్ని’ సృష్టించేందుకే అమెరికా తన సైనిక దళాలను ఉపసంహరించుకుంది. మొదట్నించీ కేకేఈ ఆప్గానిస్తాన్‌ విషయంలో అమెరికా, నాటో, ఈయూల జోక్యాన్ని ఖండిర చింది. గ్రీస్‌లో (ఎన్‌డీ, సిరిజా, పాసోక్‌) ప్రభుత్వాలలో అమెరికా జోక్యాన్ని కేకేఈ ప్రశ్నించింది. 2001 నుండి నేటివరకు అఫ్గాన్‌లో సాయుధ దళాల ప్రమేయాన్ని ఖండిరచింది. ప్రపం చంలోని సామ్రాజ్యవాద బూర్జువా దేశాలు ఆఫ్గాన్‌లో ప్రజల పరిస్థితి, మహిళలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. వారి స్వంత దేశాల్లో మహిళలపై ఇటువంటి చర్యలు తీసుకున్న ప్రభుత్వాలకు మాత్రం మద్దతు పలుకడంపై కేకేఈ తీవ్రంగా ఖండిరచింది. చరిత్రలో 1980వ దశకంలో సోవియట్‌ అంతర్జా తీయ సైనిక సహాయానికి వ్యతిరేకంగా పోరాడిన ముజాహుదీన్‌ ఉద్యమానికి (తాలిబన్‌ ఆవిర్భవిం చింది) సామ్రాజ్యవాద దేశాల మద్దతును ఈ ప్రక టన ద్వారా గుర్తుచేసింది. దేశ ప్రజలను శరణార్థు లుగా తయారుచేసే పరిస్థితికి కారణం అమెరికా సామ్రాజ్యవాద శక్తులేనని తెలిపింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న అస్పష్టమైన వైఖరికి వ్యతిరే కంగా ప్రజల పోరాటానికి కేకేఈ సంఫీుభావం ప్రకటించింది. పెట్టుబడీదారీ వ్యవస్థలో సామ్రాజ్య వాద శక్తులకు విడదీయరాని అనుబంధాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని కేకేఈ తీర్మానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img