Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అఫ్గాన్‌ ఆర్థిక పతనం నివారించాలి : గుటెర్రస్‌

యునైటెడ్‌ నేషన్స్‌ : అఫ్గాన్‌ ఆర్థికవ్యవస్థను స్థిరీకరించడానికి ఆర్థికవ్యవస్థలో లిక్విడిటీని భాగం చేయాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ సోమవారం పిలుపు నిచ్చారు. మానవతాసాయంతోపాటు అఫ్గాన్‌ ఆర్థిక పతనాన్ని నివారించడానికి అంతర్జాతీయ సమాజం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టులో తాలిబన్ల స్వాధీనం కాకముందే గత 20సంవత్సరాలుగా విదేశీ సాయం ద్వారా ఆఫ్గాన్‌ ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుంటుపడిరది. బ్యాంకుల మూసివేత, ఆరోగ్య సంరక్షణ వంటి అత్యవసర సేవలు నిలిపి వేయడమైంది. ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునే మార్గాలు మనం వెతకాలి. ఆఫ్గాన్‌ జనాభాకు సేవ చేసేందుకు పౌర సేవకులు పని కొనసా గించడానికి వీలు కల్పించే పరిస్థితులను సృష్టించడానికి మార్గాలు వెతకాలని గుటెర్రస్‌ సూచించారు. అఫ్గాన్‌లో ఆర్థిక తుఫానును ఎదుర్కొవడానికి మనం సహాయం త్వరగా చేయకపోతే వారు మాత్రమేకాకుండా ప్రపంచం మొత్తం భారీ మూల్యాన్ని చెల్లించ వలసిఉంటుదని గుటెర్రస్‌ హెచ్చరించారు. ఆహారం, ఉద్యోగాలు లేకుండా, వారి హక్కులు పరిరక్షించకుండా, ఆఫ్ఘన్‌ ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి మెరుగైన జీవితం కోసం వెతుకుతారు. డ్రగ్స్‌, క్రిమినల్‌, టెర్రరిస్ట్‌ నెట్‌వర్క్‌ల ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌ని మాత్రమే కాకుండా, ఆ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img