Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అఫ్గాన్‌ ప్రజలకు జి7 దేశాల మద్దతు

లండన్‌ : అఫ్గాన్‌ ప్రజలకు ప్రపంచ దేశాలు అండగా నిలబడాలని, శరణార్థులకు మద్దతును కల్పించాలని, మానవతా సాయం అందించాలని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పిలుపు నిచ్చారు. లండన్‌లో వర్చువల్‌గా జరిగిన గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ నేషన్స్‌ (జి7) దేశాల నాయకుల సమావే శానికి జాన్సన్‌ అధ్యక్షత వహించారు. అఫ్గాన్‌లో అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని స్థాపించ డానికి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చింది. అఫ్గాన్‌ నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరిం చుకోవడానికి ఈ నెల 31 గడువు ముగియడంతో అఫ్గాన్‌నుండి సురక్షితంగా సైనికులు వెళ్లేందుకు హామీ ఇవ్వాలని తాలిబన్లను వారు కోరారు. అఫ్గాన్‌ ప్రజలకు తమ నిబద్ధతను జి7 నాయకులు పునరుద్ఘా టించారు.అఫ్గాన్‌ ప్రజలు గౌరవంగా, శాంతి, భద్ర తతో ముఖ్యంగా మహిళలు, యువత జీవించేందుకు పరిస్థితులు కల్పించాలని సూచించారు. మహిళలు, మైనార్టీ గ్రూపుల సమన్వయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అఫ్గాన్‌లోని అన్ని పార్టీలకు జి`7 దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై సంఫీుభావంగా పోరాటం చేస్తామన్నారు. అఫ్గాని స్తాన్‌ ఉగ్రవాదానికి స్వర్గధామం కారాదని నినదిం చారు. భవిష్యత్తులో అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రజల రక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. అంతర్జాతీయ బాధ్యతలు, తీవ్రవాదం, రక్షణ, మానవహక్కులను కాపాడటం, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, జాతి, మతపరమైన చట్టపాలనను సమర్థించడం, మానవ, మాదక ద్రవ్యాల ఆక్రమ రవాణాను సమర్థ వంతంగా ఎదుర్కొవడం వంటి వాటికి కట్టుబడి ఉండాలని అప్గాన్‌లో పరిస్థితులపై జరిగిన వర్చువల్‌ సమావేశంలో దేశాధినేతలు పేర్కొన్నారు. తాలిబన్ల నిర్బంధంలో ఉన్న దేశంపై జి7 దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ ప్రజలకు తమ మద్దతు ప్రకటించారు. అఫ్గాన్‌లో స్థానికులతోపాటు విదేశీ పౌరుల భద్రత, రక్షణ, మానవతా సంక్షోభ నివారణకు ప్రశాంత వాతావరణం కల్పించాలని, సంయమనం పాటించాలని జి7 దేశాల అధినేతలు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img