Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అఫ్గాన్‌ రక్షణ మంత్రిగా తాలిబన్‌ కమాండర్‌

కాబూల్‌ : అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు వస్తుండగా మరోవైపు కీలక శాఖల్లో పదవులు తాలి బన్లు భర్తీ చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక రక్షణ మంత్రిగా కమాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఖయీమ్‌ జకీర్‌ను నియమించినుట్ల తాలిబన్‌ వర్గాలను ఉటం కిస్తూ ఆల్‌జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఈయన 2007 వరకు క్యూబాలోని గ్వాటమాలా బే జైల్లో ఖైదీగా ఉన్నారు. 2001లో జకీర్‌ను అమెరికా దళాలు అరెస్టు చేశాయి. ఇటీవలే విడుదల చేసి అఫ్గాన్‌ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. కరడు గట్టిన ఉగ్రవాదులను అమెరికా ఈ జైలుకు తరలిం చేది. ముఖ్యంగా తాలిబన్‌ ఉగ్రవాదులు కొన్నేళ్లపాటు ఇక్కడే ఖైదీలుగా ఉన్నారు. తాము ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని తాలిబన్ల అధికార ప్రతినిధి జహీహుల్లా ముజాహీద ్‌తెలిపారు. ప్రభుత్వ, బ్యాంకింగ్‌ వ్యవస్థల నిర్వాహణకు, ప్రజల సమస్యలను తీర్చడానికి ఈ నియామకాలు జరుగుతు న్నాయన్నారు. ఇందులో భాగంగా తాత్కాలిక ఆర్థిక మంత్రిగా గుల్‌ ఆఘా, తాత్కాలిక హోం మంత్రిగా సాదిర్‌ ఇబ్రహీం నియమితులయ్యారు. హద్‌ మహ్మద్‌ ఇద్రిస్‌ని అఫ్గాన్‌ బ్యాంక్‌ తాత్కాలిక హెడ్‌గా నియమించారు. సదర్‌ఇబ్రహీంను తాత్కాలిక అంతర్గత మంత్రిగా నియమించారు.
మహిళలు బైటకు రావద్దు : తాలిబన్ల హుకుం
అఫ్గాన్‌లో మహిళలపై నిర్బంధం కొనసాగు తోంది. తాలిబన్‌ సంస్థ అఫ్గాన్‌ మహిళల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత దృష్ట్యా బయట వెళ్లి ఉద్యోగాలు చేయవలసిన అవసరంలేదని ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశిం చింది. తాలిబన్‌ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌ వార్తా సమావేశంలో మాట్లా డుతూ మహిళలు తమ భద్రత రీత్యా పనులకు వెళ్లరాదని సూచించారు. గతంలో అధికారంలోఉన్నప్పటి కంటే ఇప్పుడు మహిళల పట్ల మరింత సహనంతో ఉంటారని ముజాహిద్‌ అన్నారు. 1996` 2001 మధ్య తాలిబన్లు అధికారంలో ఉన్నకాలంలో మహిళలను పని ప్రదేశాల నుంచి నిషేధించింది. అప్పట్లో మహిళలు రోడ్ల మీదకు రావాలంటే భయపడిన పరిస్థితులు. తాజాగా మళ్లీ పనులు చేయవద్దని, బాలకలు పాఠశాలలకు వెళ్లొద్దు అన్న పరిస్థితులు అప్పటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అఫ్గాన్‌లో షరియా చట్టం అమలులో ఉంటుందని, షరియా చట్టం ప్రకారం పాలన కొనసాగుతుందని వెల్లడిరచారు. మహిళల భద్రతపై అందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో పాలనలో పారదర్శకత పాటిస్తూ మహిళల భద్రతకు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.
కాబూల్‌ పోర్టుకు ఉగ్ర ముప్పు
అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్ర ముప్పు పొంచి ఉందని యుకె, యుఎస్‌, ఆస్ట్రేలియా దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ కారణంగా ప్రయాణించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. విమానాశ్రయం వెలుపల ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ సంస్థలు ఐఎస్‌ఐఎస్‌ గ్రూపు ఆత్మాహుతి దాడికి గురించి యుకె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే వేలమంది ఆఫ్గాన్‌లు విదేశాలకు తరలి పోయారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద సుమారు 10వేల మంది పడిగాపులు కాస్తున్నారు. అమెరికా సైనికులను అభ్యర్థించడం కనిపిస్తోంది.
యుఎస్‌ దళాల ఉపసంహరణ నేపధ్యంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ నెల 31లోపు ఆఫ్గాన్‌ను యుఎస్‌దళాలు, ఇతరదేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు వదలి వెళ్లవలసిఉంది. కానీ వారు బైటపడటం కష్టసాధ్యంగా మారింది. తాలిబన్లు వాహనాలను చెక్‌ చేయడం, ఎప్పుడు ఏం చేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రజలు హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోందని ఆస్ట్రేలియా పేర్కొంది. 24 గంటల్లో 19వేల మందిని తరలించినట్లు పెంటగాన్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img