Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అఫ్గాన్‌ 3 జిల్లాలు తిరుగుబాటుదారుల వశం

కాల్పుల్లో తాలిబన్లకు గాయాలు
పలువురు మృతి

కాబూల్‌ : అఫ్గాన్‌లో తాలిబన్ల శకం మొదలు కావడం యావత్‌ ప్రపంచాన్ని కలవరపాటుకు గురవుతోంది. అక్కడ పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. మరోవైపు నిరసనకారులు (తిరుగుబాటుదారులు) వారికి వ్యతిరే కంగా పోరాటాన్ని తీవ్రతరం చేశారు. మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో కొందరు తాలిబన్లు గాయపడ్డారు. మరికొందరు మర ణించినట్లు తెలుస్తోంది. ఖైర్‌ మహమ్మద్‌ అందార్బీ అనే వ్యక్తి నాయకత్వాన పబ్లిక్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌కి చెందిన సభ్యులు పోల్‌-ఏ-హెసార్‌, బేసలాప్‌ా, బాను అనే జిల్లాలను స్వాధీనపరచు కున్నారు. ఇతర జిల్లాల స్వాధీనానికి ముందుకు వెళుతున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించుకున్నారు. ఇదిలావుంటే, కాందహార్‌, హెరాత్‌ ప్రావిన్స్‌లోని భారత దౌత్య కార్యాలయాలపై తాలిబన్లు దాడులు జరపలేదని కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయ సిబ్బంది తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img