Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అభద్రతలో రొహింగ్యా శరణార్థులు

కులూపలాంగ్‌, బంగ్లాదేశ్‌ : ఉద్రేకంతో సైనికులు తమ గ్రామంపై దాడి చేసినప్పుడు మయన్మార్‌ నుండి పారిపోయిన రొహింగ్యా శంణార్థి నూర్‌ కమాల్‌కు బంగ్లాదేశ్‌లో సానుభూతి స్వాగతం లభించింది. అయితే, ఐదేళ్ల అనంతరం ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్న వ్యతిరేకత ప్రమాదకరమైనప్పటికీ స్వదేశం తిరిగి వెళ్ళాలన్న ఆలోచనలో పడేసింది. కమల్‌, 7 లక్షల 50వేలమంది ఇతర నిర్వాసితులు పొరుగున ఉన్న మయన్మార్‌ నుండి ముస్లిం మైనారిటీలు తప్పించుకుని పారిపోయినప్పటి నుండి కాలంలో చాలా మార్పు సంభవించింది. మయన్మార్‌ సైన్యం ఊచకోత నుండి బతికి బయటపడిన వారు ఇప్పుడు సామూహిక హత్యాకాండ ఐక్యరాజ్యసమితి విచారణను ఎదుర్కొంటున్నారు. తమ దేశ సరిహద్దులోని మయన్మార్‌లో ముస్లిం వ్యతిరేక హింసాకాండపై వేలాదిమంది బంగ్లా దేశీయులు ఆగ్రహోద్రగ్థులయ్యారు. మయన్మార్‌ శరణార్థులకు ఆహారం, మందులు పంపిణీ చేశారు. శరణార్థులు మాదక ద్రవ్య రవాణాదారులని, తీవ్రవాదులని మీడియా కేంద్రాలు, రాజకీయవేత్తలు అదే పనిగా ఖండిరచటంతో రొహింగ్యాలు సురక్షితంగా తమ దేశానికి తిరిగి వెళ్ళేందుకు సంప్రదింపు ప్రయత్నాలు నిర్ధరకమైన సంవత్సరాల తరువాత ప్రభుత్వ వైఖరులు కఠినతరమ య్యాయి. ‘‘ఇక్కడి స్థానిక ప్రజలు, పత్రికలలో ఎంతో ద్వేషభావం నెలకొంది. ఏ క్షణంలోనైనా హింస చోటు చేసుకోవచ్చని నేను విచారిస్తున్నాను’’ అని బంగ్లాదేశ్‌ సరిహద్దులోని సహాయ శిబిరంలోని తన ఇంటివద్ద కమాల్‌ ఎఎఫ్‌పి వార్తా సంస్థకు చెప్పారు. ‘‘మా స్వదేశం తిరిగి వెళ్ళటం మంచిదనుకొంటు న్నాము. బుల్లెట్ల వర్షం మాపై కురిసినప్పటికీ. ఒకవేళ మేము చనిపోతే, మా మాతృదేశంలోనైనా, ఖననం చేస్తారు’’ అని కమాల్‌ అన్నారు. రొహింగ్యా శిబిరాలు తమ దేశ ఆర్థిక వ్యవస్థపైన భారంగా, రాజకీయ స్థిరత్వానికి ముప్పుగా పరిణమించాయని గత నెల బంగ్లా ప్రధానమంత్రి షేక్‌ హసీనా పేర్కొన్నారు. ‘‘ఒకవేళ సమస్య నిలకడగా ఉన్నట్లయితే, మొత్తం ప్రాంతం భద్రత, స్థిరత్వాలకు దెబ్బ’’ అని న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో హసీనా చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img