Friday, April 19, 2024
Friday, April 19, 2024

అమెరికాతో ఆర్థిక, వాణిజ్య సహకారానికి చైనా పిలుపు

వాషింగ్టన్‌: చైనాఅమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు, ఆర్థిక వాణిజ్య సహకారానికి అమెరికాలో చైనా రాయబారి క్విన్‌ గ్వాంగ్‌ పిలుపునిచ్చారు. 200కంటే ఎక్కువ అమెరికన్‌ కుంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎస్‌సీబీసీ బోర్డుసభ్యులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో గ్యాంగ్‌ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఇబ్బందులు, సవాళ్ల కారణంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికన్‌ వ్యాపార సమాజానికి అత్యంత ఆందోళనకరంగా మారనున్నాయని గ్యాంగ్‌అన్నారు. చైనా మార్కెట్‌లో అమెరికా కంపెనీలను స్వాగతిస్తుందన్నారు. చైనాఅమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపార సహకారంలో ఇబ్బందులు, అనిశ్చిత పరిస్థితులు చైనా వైపు నుండి కాదన్నారు. కరోనా మహమ్మారి కాలంలో చైనా అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని విశ్వసనీయంగా అమలుచేస్తోందని క్విన్‌ పేర్కొన్నారు. అయితే అమెరికా చైనాపై వాణిజ్య ఆంక్షలను కొనసాగించిందని ఇందులో భాగంగా 900 కంటే ఎక్కువ చైనా సంస్థలను వివిధ ఆంక్షల జాబితాల్లో ఉంచిన్నట్లు పేర్కొన్నారు. ఇది ఒప్పందం అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందన్నారు. వాణిజ్య సమస్యలపై చైనాపై ఒత్తిడిచేసే ప్రయత్నంలో చైనా సబ్సిడీలపౖెె విధించిన సెక్షన్‌ 301పై దర్యాప్తుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. వాణిజ్య సంబంధాల మెరుగుదలకు విభేదాలను పరిష్కరించడానికి మరింత కృషి చేస్తున్నామని అన్నారు. చైనా వస్తువులపై ఖరీదైన సుంకాలను తొలగించాలని అమెరికా వాణిజ్య సంస్థలు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, యుఎస్‌సీబీసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ సుంకాలను తగ్గింపుతో పెరుగుతున్న ధరల నుండి అమెరికన్లు ఉపశమనం పొందవచ్చునని ట్రేడ్‌ గ్రూపులు గత నెలలో అమెరికా ప్రభుత్వానికి లేఖ రాసాయి. సుంకాల తగ్గింపుతో అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చునని పేర్కొన్నారు.
కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి
కర్బన ఉద్గారాల తగ్గింపుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. దేశ ఆధునీకరణకు బలం చేకూర్చే విధంగా బొగ్గు పరిశ్రమలను మరింతగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. పర్యావరణ సామర్ధ్యాన్ని కర్బనపు వాయువలు విడుదలను తగ్గించాలని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img