Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమెరికాలో కొత్త వైరస్‌ వ్యాప్తి

లాస్‌ఏంజిల్స్‌: ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ‘అర్కుటురుస్‌’ అమెరికాను హడలెత్తిస్తోంది. ఆ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రెండవ వైరస్‌గా నిపుణులు దీనిని గుర్తించారు. ఇప్పటికే ఎక్స్‌బీబీ.1.16 గతి పెరిగిందని, గతవారంలో 12.5శాతం కేసులు నమోదు అయినట్లు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, కట్టడి కేంద్రాలు (సీడీసీ) పేర్కొంది. ఎక్కువగా ప్రభావం చూపే వేరియంట్లలో ‘ఆర్కుటురుస్‌’ రెండవదని తెలిపింది. గతవారంలో 8.4శాతం నుంచి 12.5శాతానికి కేసులు పెరిగాయని సీడీసీ డేటా చెబుతున్నట్లు జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. రాబోయే వారాల్లో మరింత పెరుగుదల నమోదు కానున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అత్యధికంగా వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.5 ఇప్పటికీ అమెరికాలో ప్రబలంగా ఉంది. ఈ వేరియంట్‌కు సంబంధించినవి 66.9శాతం కేసులు ఈ వారంలో నమోదైనట్లు సీడీసీ డేటా చెబుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img