Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమెరికాలో డెల్టా వేరియంట్‌ పంజా

రోజుకు లక్ష కేసులు

వాషింగ్టన్‌ : అమెరికాలో డెల్టా వేరియంట్‌ విజృంభిస్తోంది. సగటున రోజుకు లక్ష కొత్త కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం లక్ష కేసులను ధృవీకరించడంతో రోజువారీ ఇన్‌ఫెక్షన్లు దాటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆసుపత్రుల్లో అవసరమైన బెడ్స్‌, వెంటిలేటర్స్‌ వంటి సౌకర్యాలు లేవని తాజా నివేదిక వెల్లడిరచింది. ఆసుపత్రుల్లో మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఆస్టిన్‌లో కేవలం ఆరు ఐసీయూ బెడ్‌లు మాత్రమే ఉన్నాయి. 313 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితి విషమిం చినట్లు హెల్త్‌ మెడికల్‌ డైరెక్టర్‌ వాక్స్‌ పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయటం ఒక్కటే మార్గంగా ఉంది. అలబామా, మిసిసిపీ రాష్ట్రాలలో అతి తక్కువ టీకా రేట్లు నమోదయ్యాయి. కరోనా మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు ఇ మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌ ద్వారా సందేశాలు ముమ్మరమయ్యాయి. గత నెలతో పోలిస్తే ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంది. జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వివరాల ప్రకారం, ఏడు రోజుల సగటు మరణాలు రెండు వారాల క్రితం 270 మరణాల నుంచి 500కి పెరిగింది. వారం రోజుల్లో కేసులు శుక్రవారానికి ఏడు లక్షల ఏభై వేలు దాటాయి. ఐసీయూలో రోగుల సంఖ్య 570 శాతంగా ఉంది. ఆస్టిన్‌లో కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. బెడ్‌లు, ఐసీయూలు పరిమితంగా ఉండటంతో ఈ మహమ్మారి బారినపడ వద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు. ఫ్లోరిడా తీవ్రంగా దెబ్బతింది. గ్రామాలలో టీకాల రేటు 40 శాతం కంటే తక్కువగా ఉంది. 29 మిలియన్‌ జనాభా కలిగిన టెక్సాస్‌లో కేవలం 439 బెడ్‌లు, 6,991 వెంటిలేటర్లు ఉన్నాయి. హోస్టన్‌లో 6.7 మిలియన్‌ జనాభాకు కేవలం 41 బెడ్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img