Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అమెరికాలో వరుస కాల్పులు

మిస్సిసిపీలో ఆరుగురి కాల్చివేత: మృతుల్లో ఓ మహిళ
52ఏళ్ల నిందితుడి అరెస్టు ` ఏడాదిలో 73వ ఘటన

వాషింగ్టన్‌: అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది 73వ కాల్పుల ఘటన మిస్సిసిపీలోని టటే కౌంటీలో జరిగింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. శనివారం అర్కబుట్లలోని మూడు చోట్ల కాల్పులు జరిగాయని, అన్ని ఘటనల్లో కలిపి ఆరుగురు మరణించారని టటే కౌంటీ షరీఫ్‌ కార్యాలయం వెల్లడిరచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అతనిని అర్కబుట్లకు చెందిన రిచర్డ్‌ దలే క్రమ్‌ (52)గా గుర్తించినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి హత్య ఆరోపణలతో కేసు నమోదు చేయగా అదనపు ఆరోపణలు త్వరలోనే చేర్చనున్నట్లు వెల్లడిరచింది. అర్కబుట్ల రోడ్డులోని ఓ షాప్‌లో చొరబడి రిచర్డ్‌ కాల్పులు జరిపగా ఇద్దరు చనిపోయారని, అక్కడే ఓ ఇంట్లోకి వెళ్లి మరో ఇద్దరిని కాల్చి చంపాడని, ఇంకో ఇద్దరిని అర్కబుట్ల డ్యామ్‌ వద్ద కాల్చివేసినట్లు షరీఫ్‌ కార్యాలయం తెలిపింది. మొదటి హత్య ఉదయం 11 గంటలప్పుడు జరిగిందని పేర్కొంది. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు వెల్లడిరచింది. డ్యామ్‌ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటన పేర్కొంది.
ఇక చాలు: జోబైడెన్‌ ఆగ్రహం
తుపాకీ హింస ఒక అంటువ్యాధి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇక చాలు. కొత్త ఏడాదిలో 48 రోజులు గడిచాయి. ఇంతలోనే 73 కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. తుపాకీ సంస్కృతి నశించాలి. ఇందుకోసం చట్టసభ చర్యలు తీసుకోక తప్పబోదు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తుపాకీ చట్టాన్ని సంస్కరించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img