Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమెరికా, కెనడా,మెక్సికో నాయకుల సమావేశం

వాషింగ్టన్‌ : ఆర్థిక ఏకీకరణ, వలసలు, కరోనా మహమ్మారిపై చర్చించడానికి ఐదు సంవత్సరాలలో మొదటిసారి కెనడా, మెక్సికో, అమెరికా నాయకులు వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, కెనడా ప్రధాని ట్రూడోవ్‌, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌ల సమావేశం ఉమ్మడి ఆర్థిక సహకారం లక్ష్యంగా జరుగనుంది. మెక్సికో, కెనడా రెండిరటికీ అమెరికా వాణిజ్య భాగస్వామి కాగా అమెరికా నిబంధనలు అనుగుణంగా ప్రతిపాదిత ఎలక్ట్రిక్‌ వాహనపన్ను క్రెడిట్‌పై కొంత ఆందోళన నెలకొంది. ఎజెండాలో మరో ప్రధాన సమస్య ఇమ్మిగ్రేషన్‌, వలసల కోసం ప్రాంతీయ దృష్టిని రూపొందించడం లక్ష్యంగా ఉన్నట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. మెక్సికో సరిహద్దులో అత్యధికంగా సెంట్రల్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల నుండి అత్యధిక సంఖ్యలో వలసదారులు వస్తున్నారు. వీరుపేదరికం, రాజకీయ అస్థిరత కారణంగా పారిపోతున్నారు. టైటిల్‌ 42కింద ఆశ్రయం కోరేవారిని తిరిగి తీసుకోవడానకి మెక్సికోపై అమెరికా ఆధారపడుతోంది. గత సంవత్సరం ట్రంప్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యసంరక్షణ విధానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడం ద్వారా సరిహద్దు ఏజంట్లంను మెక్సికోకు తర్వగా పంపించాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img