Friday, April 19, 2024
Friday, April 19, 2024

అమెరికా, చైనా మధ్య డిజిటల్‌ సమావేశం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సోమవారం డిజిటల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వైట్‌హౌస్‌ సెక్రటరీ జాన్‌సాకి తెలిపారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలపై కలిసి పనిచేసే మార్గాలపై వారు చర్చిస్తారని తెలుస్తోంది.
ఈ సమావేశంలో అమెరికాఅధ్యక్షడు బైడెన్‌ అమెరికా ఉద్దేశాలు, ప్రాధాన్యతలను వివరిస్తారు. చైనాతో మా ఆందోళనలను స్పష్టంగా తెలియజేస్తారు. అని సాకి ఒక ప్రకటనలో తెలిపారు.ు బైడెన్‌, జిన్‌పింగ్‌ మధ్య సంవత్సరం చివరిలోపు డిజిటల్‌ సమావేశాన్ని నిర్వహించడానికి చైనాతో సాధ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యుఎస్‌ అధికారులు గత నెలలో తెలిపారు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే.. చైనా నుండి బిలియన్‌ డాలర్ల దిగుమతులపై ట్రంప్‌ సుంకాలు విధించారు.
దీనిపై చైనా కూడా ఇదే చర్య తీసుకుంది. తాజాగా రెండు దేశాలు వాతావరణ సహకారాన్ని ప్రోత్సహిస్తాయని చైనా, అమెరికా కాప్‌26 సదస్సులో ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img