Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అమెరికా మా కాళ్లు లాగుతోంది

ఇరాన్‌ అధ్యక్షుడు రెయిసీ
టెహ్రాన్‌ : ‘‘నేడు ఒక నిర్ణయం తీసుకోవల సింది అమెరికన్లు. అయితే వారు జాప్యం చేస్తూ, మా కాళ్ళు లాగుతున్నారు’’ అని ఇరాన్‌ అధ్యక్షుడు రెయిసీ టెహ్రాన్‌లో పత్రికా విలేకరులతో చెప్పారు. టెహ్రాన్‌తో 2015తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకోడానికి బదులు అమెరికా మా కాళ్ళు గుంజుతున్నదని మంగళవారం నిందించారు. ‘సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)గా విధితమైన అగ్ర రాజ్యాలతో ఒప్పందం, తమ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసినందుకు ప్రతిఫలంగా ఇరాన్‌కు ఆంక్షల ఊరట కలుగచేస్తుంది. 2018లో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవటంతో అది జీవాధారంపై ఉంది. ఆ ఒప్పందం పునరుద్ధరణకు 2021 నుండి చర్చలు జరుగుతున్నాయి. మహిళల వస్త్రధారణ కఠిన నియమావళిని ఉల్లంఘించిందని అరెస్టు చేసిన అనంతరం గత నెల 16న 22 యేండ్ల మహాసా అమినీ మృతితో ఉవ్వెత్తున ఇరాన్‌లో ప్రదర్శనల కొన్ని వారాల అనంతరం రెయిసీ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అమినీ నిరసనలకు ప్రతిస్పందనగా అమెరికా, ఇతర పశ్చిమ పార్టీలు ఇరాన్‌పై తాజా ఆంక్షలు విధించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img