Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆచరణాత్మక సహకారం అవసరం : క్వాడ్‌ కూటమి

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి, వాతావరణ సంక్షోభం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా 21వ శతాబ్దపు సవాళ్లపై ఆచరణాత్మక సహకారం అవసరమని క్వాడ్‌ నాయకులు శుక్రవారం ప్రతిజ్ఞ చేశారు. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇండియాలతో కూడిన క్వాడ్‌ నాయకుల మొదటి సమావేశం వైట్‌హౌస్‌లో జరిగింది. నాలుగు దేశాలూ ప్రస్తుతం ఒకేరకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఆసియా స్వేచ్ఛ, అలజడులులేని ప్రాంతంగా ఉండాలన్న లక్ష్యం ప్రధానమని క్వాడ్‌అభిప్రాయపడిరది.
ఇండో పసిఫిక్‌తో పాటు ప్రపంచమంతటా వాంతి శ్రేయస్సును క్వాడ్‌ సహకారం నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగాలని క్వాడ్‌ నిర్ణయించింది. ప్రపంచంలోని వివిధ సమస్యలపె తమ దృష్టిని కేంద్రీకరించడానికి ఇదొక అవకాశంగా క్వాడ్‌ నాయకులు ప్రకటించారు. బైడెన్‌ క్వాడ్‌ఫెలోషిప్‌ను ప్రకటించారు. ఇది భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. 21వ శతాబ్దపు సవాళ్లపై తమ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఉత్పత్తిని పెంచడంద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన వాక్సిన్‌లను అందుబాటులోకి తేవడం ద్వారా కొవిడ్‌`19 మహమ్మారిని అంతం చేయాలని నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాలు ఎంత బాగా కలిసి పనిచేస్తాయో క్వాడ్‌ గ్రూపు రుజువు చేస్తుందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల రూపకల్పన, వాతావరణ సంక్షోభం, స్పేస్‌, సైబర్‌ సెక్యూరిటీని ఎదుర్కోవాలని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తదుపరి తరం తమ ప్రతిభను పెంచుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్‌ ప్రధాన మంత్రి యోషిహీడే సుగాలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img