Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఆఫ్ఘన్‌లో తాలిబన్ల హవా…!

కాందహార్‌ : ఆగస్టు చివరికల్లా ఆఫ్ఘన్‌ నుంచి తమ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటామని అమెరికాతో పాటు యూరప్‌ దేశాలు ప్రకటించి నప్పటికీ ఆ వాతావరణం ఎక్కడా లేదు. ఇప్పటికే సగం దేశం మీద తాలిబన్ల పెత్తనం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రవాదులదే అధికారం. ఆఫ్ఘన్‌ నగరాల్లో సైతం తాలిబన్లు దాడులను ఉధృతం చేయడంతో ఆఫ్ఘన్‌్‌, తాలిబన్‌ దళాల మధ్య అనేక ప్రధాన నగరాల పొలిమేరలలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. దీనితో దక్షిణ ప్రాంతంలోని కీలక విమానాశ్రయం రాకెట్‌ కాల్పులకు గురైంది. దేశంలోని రెండో అతి పెద్ద విమానాశ్రయం కాందహార్‌లో శనివారం రాత్రి జరిగిన దాడులతో ఆదివారం తెల్లవారు జాము విమానాలను నిలిపివేశారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌ సమీపంలో తాలిబన్లు, ఆఫ్ఘన్‌దళాల మధ్య ఘర్షణలు జరిగాయి. తాలిబన్‌ స్థావరాల లక్ష్యంగా వైమానిక దాడులుచేస్తూ హెరాత్‌కు పశ్చిమంగా ఉన్న ప్రాంతంలో పోరు కొనసాగుతోంది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హత మయ్యారు. ఆఫ్ఘన్‌ సంక్షోభానికి రాజకీయ ఒప్పందం ఒక్కటే పరిష్కారమని ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పేర్కొన్నారు. అత్యంత కీలకమైన ఇరాన్‌, పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాలపై పూర్తిస్థాయిలో పట్టు బిగించారు. పశ్చిమ, దక్షిణ ఆఫ్ఘన్‌లోని హెరాత్‌, లష్కర్‌ ఘా, కాందహార్‌ నగరాలపై ఆధిపత్యం సాధించేందుకు భద్రతా సిబ్బందితో పోరాడుతున్నారు. త్వరలోనే హెరాత్‌, లష్కర్‌ ఘా, కాందహార్‌ తాలిబన్ల వశం కావడం తథ్యమని స్థానికుల అంచనా..
తాలిబన్లు హతం : హెరాత్‌, లష్కర్‌ ఘా, కాందహార్‌లో ఆదివారం భద్రతా బలగాలు, తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ కొనసాగింది. శనివారం లష్కర్‌ ఘాలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలోకి తీవ్రవాదులు దూసుకొచ్చారు. రాత్రి సమయంలో వెనక్కి మళ్లారు. తాలిబన్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆఫ్ఘన్‌, అమెరికా సేనలు వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఈ దాడుల్లో పదుల సంఖ్యలో తాలిబన్లు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి.హెల్మాండ్‌ ప్రావిన్స్‌ రాజ ధాని లష్కర్‌ ఘాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగరంలో తీవ్రవాదులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు సమాచారం. తాలిబన్లు కొన్ని ఇళ్లను ఆధీనంలోకి తెచ్చుకొని, అక్కడే మాటు వేశారని స్థానికులు చెబుతున్నారు. హెరాత్‌లో పరిస్థితి అదుపులోనే..ఆఫ్ఘన్‌కు ఆయువుపట్టు లాంటి సిటీ హెరాత్‌. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కొంత అదుపులోనే ఉంది. తీవ్రవాదులపై సైన్యందే పైచేయిగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img