Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం

గాబోరోస్‌ : దక్షిణాఫ్రికా కస్టమ్స్‌ యూనియన్‌ (ఎస్‌ఏసీయూ) దేశాలైన బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, ఈశ్వతిని, నమీబియా, లెసోతో దేశాల్లో ఆర్థిక స్తబ్దత పెరిగే ప్రమాదం ఉందని బోట్స్‌వానా అధ్యక్షుడు మోక్‌వీట్సీ మసిసి ఆందోళన వ్యక్తం చేశారు. బోట్స్‌వానా రాజధాని గాబరోన్‌లో ఎస్‌ఏసీయూ దేశాధినేతల 7వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మాసిసి మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న వివాదంతో ప్రపంచదేశాల్లో ఆర్థిక వృద్ధి మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022లో ఆర్థికవృద్ధి ఇప్పటికే 3.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, ముఖ్యంగా ఆహార కొరతలతో ప్రస్తుత ప్రపంచం ప్రమాదంలో ఉందన్నారు. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఎస్‌ఏసీయూ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను పరిపుష్ఠం చేసేందుకు తగిన చర్యలను చేపట్టాలని మాసిసి పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రాసెసింగ్‌, వస్త్రాలు, దుస్తులు, సౌందర్య సాధనాలు, ముఖ్యమైన నూనెలు, ఔషధాలలో ప్రాంతీయ విలువ గొలుసులను అభివృద్ధి చేయడం ద్వారా కస్టమ్స్‌ యూనియన్‌ ప్రాంతీయ ఆర్థిక సమగ్రతను మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తుందని ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ పౌలినా ఎలాగో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img