Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆర్థికంగా కోలుకునేందుకు మరింత కాలం

వాషింగ్టన్‌ : ఆర్థిక ఉత్పత్తి 2022 నాటికి కొవిడ్‌ `19కి ముందున్న స్థాయికి తిరిగివస్తుందని అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకునేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని ప్రపంచ బ్యాంకు చీఫ్‌ క్రిష్టిలినా జార్జివ తెలిపారు. అనేక దేశాలలో ద్రవ్యోల్బణం వేగంగా పెరిగిందని కొన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ధరల ఒత్తిడి కొనసాగుతుందని జార్జివ తెలిపారు. ఆహార ధరల పెరుగుదల గత ఏడాది 30శాతం పైగా పెరిగింది. ఇంధన ధరలతోపాటు పేద కుటుంబాలపై ఈ ఒత్తిడి పెను ప్రభావం చూపిందని తెలిపారు. టీకాలను వేగవంతం చేయాలని జార్జివా దేశాలను కోరారు. ఈ సంవత్సరం చివరినాటికి ప్రతి దేశంలోను కనీసం 40శాతం మందికి 2022 మొదటి సగం నాటికి 70శాతం మంది టీకాలు వేయించుకోవాలని సూచించారు. టీకాలు వేయించుకోకపోతే సుదీర్ఘ మానవ విషాదం నెలకొనే అవకాశం ఉందని సూచించారు. ఎక్కువ దేశాల్ల 70శాతం టీకాలు వేయకపోతే ఆర్థికవృద్ది కష్టమవుతుందన్నారు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి నష్టాలు వచ్చే ఐదేళ్లలో 5.3 ట్రిలియన్‌కు పెరుగుతాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img