Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇండోనేషియాలో భారీ భూకంపం..162కి చేరిన మృతుల సంఖ్య.. వీధుల్లోనే చికిత్స..

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటికే మృతుల సంఖ్య 162కి చేరగా మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని వైద్యులు అంటున్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నారు. 5.6 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం రాజధాని జకార్తాకు ఆగ్నేయంగా 75 కి.మీ (45 మైళ్లు) దూరంలో ఉన్న పశ్చిమ జావా పర్వత ప్రాంతంలోని సియాంజూర్‌ పట్టణానికి సమీపంలో ఉంది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు కంపించిన భూమి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రాంతంలో 2.5 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. 162 మంది మరణించారని, 326 మంది గాయపడ్డారని పశ్చిమ జావా గవర్నర్‌ రిద్వాన్‌ కమిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. భూకంపం కారణంగా 162 మంది మరణించినట్టు ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ ప్రకటించింది. చాలా భవనాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రిద్వాన్‌ విలేకరులతో అన్నారు. అధికారులు మాత్రం 700 మందికిపైగా పడినట్లు, మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. భూకంపం ధాటికి ఆస్పత్రులు, భవనాలు కూలిపోవడంతో వీధుల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img