Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇక జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్!

ఫిషింగ్ అటాక్స్ నుంచి తన వినియోగదారులను కాపాడుకునేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. ఇకపై జీమెయిల్ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది. వెరిఫైడ్ ఈమెయిల్ అకౌంట్లకు ఈ టిక్ మార్కు ఇస్తామని తాజాగా వెల్లడించింది. ఈమెయిల్ పంపిన వారి పేరు పక్కనే ఈ మార్కు కనిపిస్తుందని పేర్కొంది.సంస్థ ప్రకటన ప్రకారం, గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్లు, లెగసీ జీ సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్లు, వ్యక్తిగతంగా వెరిఫైడ్ జీమెయిల్ అకౌంట్ కలిగిన వారికి ఈ టిక్ మార్కును కేటాయిస్తారు. 2021లో గూగుల్ ప్రారంభించిన బ్రాండ్ ఇండికేటర్స్ ఫర్ మెసేజ్ ఐడెంటిఫికేషన్ ఫీచర్‌కు (బీఐఎమ్ఐ) కొనసాగింపుగా గూగుల్ ఈ టిక్ మార్కును ప్రవేశపెట్టింది.బ్లూ టిక్ మార్క్ సాయంతో వినియోగదారులు నకిలీ అకౌంట్ల నుంచి వచ్చే ఫిషింగ్ దాడులనుంచి తమని తాము కాపాడుకోవచ్చని పేర్కొంది. ఇక బీఐఎమ్ఐ‌ను వినియోగిస్తున్న సంస్థలన్నిటీకి ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ మార్క్ జారీ అవుతుంది. అయితే, ఈ టిక్ మార్క్‌ను గూగుల్ ప్రస్తుతానికి ఉచితంగానే జారీ చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img