Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇజ్రాయిల్‌`పలస్తీనా మధ్య రాజకీయ పరిష్కారం

ఐరాస పిలుపు
ఐక్యరాజ్యసమితి : ఇజ్రాయిల్‌, పలస్తీనాల మధ్య వివాదాన్ని సమాప్తం చేయడానికి రాజకీయ పరిష్కారంకోసం ఐక్యరాజ్యసమితి బుధవారం పిలుపునిచ్చింది. గాజాలో పరిస్థితిని మెరుగుపరచేందుకు అత్యవసర ప్రయత్నాలు వేగంగా జరగాలని సూచించారు. ఇజ్రాయిల్‌`పలస్తీనాల మధ్య సంఘర్షణలను పరిష్కరించడం, ఆక్రమణలను నిలువరించేందుకుగాను ఐక్యరాజ్యసమితి తీర్మానాలు అమలు చేయాలని కోరింది. అంతర్జాతీయంగా రెండుదేశాల మధ్య పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక ఒప్పందాల అమలు చేయాలని పలస్తీనాలో యుఎన్‌ మానవతా సమన్వయకర్త లిన్‌ హేస్టింగ్స్‌ పేర్కొన్నారు. మేలో 11రోజులపాటు రెండు దేశాల మధ్య జరిగిన భీకరపోరాటం అనంతర పరిస్థితులు, పరిణా మాలపై భద్రతామండలికి వివరించారు. వీడియోలింక్‌ ద్వారా జెరూసలెం నుంచి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య పోరాటం గాజా సామాజిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. నివాసితులకు కనీస రక్షణకరువైంది. ఈ పోరాటం ద్వారా నష్టాన్ని పూడ్చేందుకు 485 మిలియన్‌ డాలర్లు ఖర్చుఅవుతాయని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి సమన్వయంతో మానవతా స్పందనకోసం 95 మిలియన్‌ డాలర్ల కోసం అభ్యర్థించడంతో 45 మిలియన్‌ డాలర్లు సేకరించడమైందని హేస్టింగ్స్‌ తెలిపారు. ఇజ్రాయిల్‌, పలస్తీనా అధికారులు ఈజిప్టు, ఖతార్‌ ఇతరప్రాంతీయ అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో పునర్నిర్మాణ కార్యక్రమాలను అమలుకు పూనుకున్నారు. గాజా పవర్‌ ప్లాంట్‌కోసం ఇంధన పంపిణీతోపాటు కొన్ని వస్తువుల దిగుమతి, ఎగుమతులపై ఆదనపు ఆంక్షలను ఎత్తివేశారు. ‘గాజాలో పిల్లలకు పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై ముఖ్యంగా దృష్టి సారించారు. చట్టబద్ధమైన పలస్తీనా ప్రభుత్వానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. అరబ్‌ ప్రాంతానికి చెందిన వారితో సహా దాతలందరికీ అవసరమైనసేవలు, మానవతా సహాయానికి అంతరాయం కలగకుండా నిధుల పంపిణీకి హేస్టింగ్స్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img