Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇటలీలో అత్యవసర పరిస్థితి

70 ఏళ్లలో లేనంత నీటి ఎద్దడి

రోమ్‌ : ఇటలీలో 70 ఏళ్లలో లేనంత నీటి ఎద్దడి వల్ల వ్యవసాయంతో పాటు విద్యుత్‌ సరఫరాపై ప్రభావం తీవ్రంగా పడిరది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పరిస్థితి మరింత దారుణమైంది. దీంతో ఐదు ఉత్తర, మధ్య ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద నది పో నీటిస్థాయి 70ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఐదు ఉత్తర ప్రాంతాలైన ఎమిలియా రోమగ్న, ఫ్రూలీ వెంజియా గులియా, లొంబార్డీ, పీడమాంట్‌, వెనిటోల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. నీటి కరవుతో ‘పో’ నది పరిసర ప్రాంతాలు బీడు భూములయ్యాయి. ఈ కొరతత వల్ల ఇటలీ వ్యవసాయ ఉత్పత్తుల్లో 30 శాతం దిగుబడి తగ్గనుంది. అనేక మున్సిపాల్టీల్లో నీటి వినియోగంపై అధికారులు ఆంక్షలు విధించారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతంతో ఉత్తర ఇటలీలో నీటి ఎద్దడి ఏర్పడిరది. పో నది తూర్పు దిశగా సుమారు 650 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇది ఉప్పునీటి నది కాగా పరివాహాక ప్రాంతంలోని పంటలు నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. పో నది చుట్టూ సారవంతమైన భూములు ఉన్నాయిగానీ నాలుగు నెలలుగా వాన లేక 40 శాతం మేర ఆహారోత్పత్తి జరుగుతోంది. బియ్యం, గోధుమలు దిగుబడి తగ్గింది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో 50 శాతం పశువులు అల్లాడుతున్నాయి. రోమ్‌లోని టైబర్‌ నది నీటిమట్టం తగ్గింది. లేక్స్‌ గార్డా, మగ్గియోర్‌లలోనూ ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. వాటి సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నాయి. జలవిద్యుత్‌ ఉత్పత్తికి నీటి కొరత ప్రధాసమస్యగా మారింది. పర్యవసానంగా విద్యుత్‌ కొరతలు దేశాన్ని అల్లాడిస్తున్నాయి. 20 శాతం ఉత్పత్తి చేసే చాలా సంస్థలు ఉత్తర పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. ఫలితంగా జలవిద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ క్రమవలో వ్యవసాయానికి 3 బిలియన్‌ యూరోలు అంటే 3.1 బిలియన్‌ డాలర్ల మేర కరవునిధిని మారియో డ్రాఘి ప్రభుత్వం కేటాయించింది. అలాగే, కరవు సహాయ నిధులుగా 36.5 మిలియన్‌ యూరోలు ప్రకటించింది. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ నాటో సదస్సు నుంచి హుటాహుటి స్వదేశానికి ప్రధాని డ్రాఘి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలావుంటే, ఆదివారం భారీ మంచుకొండ విరిగి పడగా కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 26 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అసాధారణ / ఊహించని వాతావరణ పరిస్థితులే దీనికి దారి తీశాయని సోమవారం ఆల్ఫ్‌ పర్వత ప్రాంతాన్ని సందర్శించిన మారియో డ్రాఘి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img