Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇటలీలో ఫాసిస్టు పాలనపై ఆగ్రహజ్వాల

రోమ్‌ : ఇటలీలో ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా రోమ్‌లో 50వేల మంది ప్రజలు ధ్వజమెత్తారు. ఇటలీ రాజధాని రోమ్‌లోని చరిత్రాత్మకమైన కార్మికసమాఖ్య సీజీఐఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద సుమారు 50 వేలమంది ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. దేశంలో ఉపాధి కల్పనకుగాను యువత నినదించారు. ఈ ప్రదర్శనలో విదేశాంగ మంత్రి లుయిగి డి మాయో, మాజీ ప్రధాన మంత్రి గుయిసెప్పె కాంటో పాల్గొన్నారు. ఫాసిజాన్ని వ్యతిరేకిద్దాం అంటూ నినదించారు. ప్రముఖ కార్మిక సంస్థ సీజీఐఎల్‌ నాయకుడు మౌరిజియో లాండిని ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ప్రతి ఒక్కరికీ ప్రజాస్వామ్యా హక్కుకోసం పోరాడే ప్రదర్శనగా లాండిని పేర్కొన్నారు. ఫాసిస్టు వ్యతిరేక, ప్రజాస్వామ్య అనుకూల ప్రభుత్వం తమకు అవసరమని లాండిని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని యుద్ధాల ద్వారా ఎగుమతి చేయలేం..పని,హక్కుల ద్వారా సాధించుకుంటాం అని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. రోమ్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్‌ పాస్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ‘ఫ్రీడమ్‌’ అన్న బానర్‌ను ప్రదర్శనకారులు చేపట్టారు. ఇటాలియన్‌ జనరల్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధిపతి లుయిగి మాట్లాడుతూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలనేది ఈ నిరసన లక్ష్యంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img