Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇరాన్‌-రష్యాల స్నేహంతో ప్రాంతీయ భద్రత

టెహ్రాన్‌: ఇరాన్‌, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కట్టుబడిఉంటామని పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రెసిడెన్సీ వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం, సిరియా సమస్యపై రైసీ, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌లతో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొనడానికి పుతిన్‌ మంగళవారం మధ్యాహ్నం టెహ్రాన్‌కు వచ్చిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది.రైసీ పరిపాలన లో గణనీయంగా మెరుగుపడిన ద్వైపాక్షిక సంబంధాలలో తాజా పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయి, ముఖ్యంగా ఆర్థిక, భద్రత, మౌలిక సదుపాయాలు, ఇంధనం, వాణిజ్యం, పరిశ్రమల రంగాలలో పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాన్ని కొనసాగించాలని ఇరువురు అధ్యక్షులు కూడా కృతనిశ్చయం వ్యక్తం చేశారు. తీవ్రవాదంపై పోరాటంలో ఉమ్మడి విజయాలను ప్రశంసిస్తూ, రైసీ, పుతిన్‌ ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను ఎత్తి చూపారు, ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించాలనే రెండు దేశాల సంకల్పం ‘‘గొప్పది’’ అని రైసీ అభివర్ణిస్తూ, జనవరి చివరలో మాస్కోలో పుతిన్‌, జూన్‌ చివరిలో అష్గాబాత్‌తో తన సమావేశాల తరువాత, ఇరాన్‌-రష్యాల మధ్య సహకారం మరింత బలపడిరదన్నారు. సిరియాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో ‘‘విజయవంతమైన’’ ద్వైపాక్షిక సహకారంపై, ఇరాన్‌ అధ్యక్షుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌ రష్యా సహకారంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిజాయితీని, దృఢ సంకల్పాన్ని నిరూపించుకున్నాయని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img