Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇరాన్‌, సౌదీ మధ్య విమానాలు పున:ప్రారంభం

రియాద్‌: ఇరాన్‌, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను చక్కబెట్టేందుకు చైనా మధ్యవర్తిత్వం సత్ఫలితాలిచ్చింది. రెండు దేశాలు విమాన సేవల పున:ప్రారంభానికి అంగీకరించాయి. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాన్‌ ప్రతినిధి బృందం సౌదీ రాజధాని రియాద్‌కు వెళుతుందని, అలాగే సౌదీ నుంచి సాంకేతిక నిపుణుల బృందం ఇరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని సందర్శిస్తుందని, వాణిజ్య విమానాల పున:ప్రారంభంపై ప్రతినిధులు చర్చిస్తారని ఇరాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అలీ రెజా ఎనయటి తెలిపారు. ఇరాన్‌, సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణతో పాటు రెండు నెలల్లో రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యకలాపాలను పున: ప్రారంభించే విషయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చొరవతో ఒప్పందం కుదురింది. మార్చి 10న రెండు దేశాలు ఇదే విషయాన్ని ప్రకటించాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లా హియాన్‌, సౌదీ రాజు ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ బీజింగ్‌లో సమావేశమై సంయుక్త ప్రకటనపై సంతకం చేసినట్లు మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img