Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈక్వెడార్‌లో ఉద్యమించిన ప్రజాసంఘాలు

క్విటో : దక్షిణ అమెరికా ఖండ దేశమైన ఈక్వెడార్‌లో ప్రముఖ రంగాలు, వ్యవస్థలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈక్వెడార్‌ అధ్యక్షుడు తిల్లెర్మో లాస్సో ప్రతిపాదించిన నయా ఉదారవాద చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద పెత్తున నిరసన చేపట్టారు. దేశంలో అమలవుతున్న ఆర్థిక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.. పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. నిరసనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రవాణా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రదర్శనకారులు శాంతియుతంగా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు ప్రతిఘటించారు. ఈ నేపధ్యంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. యునైటెడ్‌ వర్కర్స్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌యూటీ), పాపులర్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌పీ), కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండీజినస్‌ నేషనాలిటీస్‌ వంటి కీలక రంగాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. వీరికి మద్దతుగా ఫెడరేషన్‌ ఆఫ్‌యూనివర్సిటీ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఈక్వెడార్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ పెజెంట్‌, బ్లాక్‌ అండ్‌ ఇండీజినస్‌ ఆర్గనైజేషన్స్‌ ప్రదర్శనలో పాల్గొన్నారు. దేశంలో కార్మికవర్గానికి, తక్కువ ఆదాయ రంగాలకు చెందినవారికి న్యాయమైన విధానాలను డిమాండ్‌ చేస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్ముందు ప్రదర్శన చేపట్టేందుకు నాయకులు సంకల్పించారు. గ్రామీణ, పట్టణ కార్మికలు, గృహిణులు, చిన్నచిన్న వ్యాపారస్థులు, వర్సిటీ విద్యార్థులు వారి హక్కుల రక్షణకోసం గళమెత్తారు. మా కుటుంబాల జీవన పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చకండని నినదించారు. వరి ఉత్పత్తిదారులు ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img