Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఉక్రెయిన్‌కి యుద్ధట్యాంక్‌లు పంపనున్న.. అమెరికా..జర్మనీ

ఉక్రెయిన్‌కి యుద్ధ ట్యాంక్‌ లను పంపేందుకు అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ రెండు అగ్రదేశాలు యుద్ధ ట్యాంక్‌లను పంపిస్తే.. అప్పుడు ఉక్రెయిన్‌ వార్‌ కొత్త రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దీనిపై త్వరలో ఓ ప్రణాళికను వెల్లడిరచనున్నారు. సుమారు 30 ఎం1 అబ్రామ్స్‌ ట్యాంకులను పంపాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కనీసం 14 లియోపార్డ్‌ 2 ట్యాంక్‌లను ఉక్రెయిన్‌కు పంపించాలని జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కల్జ్‌ భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికాలో ఉన్న రష్యా అంబాసిడర్‌ దీన్ని తప్పుపట్టారు. ఇది మళ్లీ రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. యుద్ధ ట్యాంక్‌లు వస్తే రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ ప్రదేశాలను మళ్లీ చేజిక్కించుకోవచ్చు అని ఉక్రెయిన్‌ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img