Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉక్రెయిన్‌పై ఏకాభిప్రాయం కష్టమే


ఎస్‌సీఓ సదస్సు కోసం జిన్‌పింగ్‌కు భారత్‌ ఆహ్వానం
చైనా వ్యవహారాల ఇన్‌చార్జి మా జియా

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు భారత్‌ నుంచి షాంఘై కోఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు ఆ దేశ వ్యవహారాల ఇంచార్జి మా జియా ధ్రువీకరించారు. ‘ఎస్‌సీఓ సదస్సు జులైలో జరగనున్నది. ఈ సదస్సుకు ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉన్నందున జిన్‌పింగ్‌ వెళతారో లేదో చెప్పలేమని’ అమె అన్నారు. ఉక్రెయిన్‌ అంశంపై ఏకాభిప్రాయం కోసం జీ20 సదస్సులో భారత్‌ యత్నించనున్న క్రమంలో అందుకు కనీసం రెండు నెలల ముందు జరిగే ఎస్‌సీఓ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఉక్రెయిన్‌ విషయంలో ఏకాభిప్రాయం కష్టమేనని జియా అభిప్రాయపడ్డారు. ‘గతేడాది బాలీ తీర్మానం తర్వాత పరిస్థితి తీవ్రతరమైంది.దీంతో జీ20లో ఉక్రెయిన్‌పై ఏకాభిప్రాయం కుదరడం కష్టసాధ్యం’ అని ఆమె అన్నారు. సెప్టెంబరులో జీ20 సదస్సు కోసం అధికారిక ఆహ్వానం జిన్‌పింగ్‌కు అందిందని చెప్పారు. ఎస్‌సీఓతో పాటు సెప్టెంబరు 910 తేదీల్లో జరిగే జీ20 సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహిస్తోంది. జూన్‌ 25న ఎస్‌సీఓ సదస్సు నిర్వహించాలని భారత్‌ తొలుత ప్రతిపాదించింది. అయితే జూన్‌ చివరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఉన్నందున ఈ సదస్సును జులై 5 తేదీకి వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో సరిహద్దు ప్రతిష్ఠంభనకు చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని, భారత్‌గానీ చైనాగానీ యుద్ధాన్ని కోరుకోవడం లేదని జియా వెల్లడిరచారు. సంక్లిష్ట పరిస్థితులలో వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్‌టేషన్‌ అండ్‌ కోఆపరేషన్‌ (డబ్ల్యూఎంసీసీ) చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2020 ఏప్రిల్‌మేలో ఎల్‌ఏసీ వద్ద సైనిక ఘర్షణ తర్వాత ఇద్దరు దేశాధినేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు. గతేడాది బాలీలో జరిగిన జీ20 సదస్సులో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య కరచాలనం, అనధికారిక ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడిరది. కాగా ఎస్‌సీఓ సభ్యదేశాల్లో భారత్‌, రష్యా, చైనా, కిర్జిగ్‌ రిపబ్లిక్‌, కజకస్తాన్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. ఇది 20ఏళ్ల కిందట ఏర్పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img