Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉక్రెయిన్‌లో రష్యా సైన్యానికి కొత్త కమాండర్‌

మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యానికి కొత్త కమాండర్‌ను అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నియమించారు. రష్యా సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ చీఫ్‌ వాలెరీ గెరాసిమోవ్‌ కొత్త కమాండర్‌గా నియమితులైనట్లు ఆ దేశ రక్షణశాఖ ప్రకటించింది. మాజీ కమాండర్‌ సెర్గీ సురోవికిన్‌తో పాటు గ్రౌండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఒలేగ్‌, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ అలెక్సీ కిమ్‌లు గెరాసివ్‌ డిప్యూటీలుగా నియమితులైనట్లు పేర్కొంది. సాయుధ దళాలకు బలమైన మద్దతు అవసరమని, మరింత ప్రభావవంతమైన, నియంత్రణ కలిగిన కమాండర్‌ అవసరమని తెలిపింది. ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో భాగంగా విస్తృత చర్యలు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img