Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాలది తప్పుడు ప్రచారం

ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి
ఐరాస: ఉక్రెయిన్‌లోని కఖోవ్కా జల విద్యుత్‌ కేంద్రంపై కీవ్‌ దళాల దాడిని న్యూయార్క్‌లో జరిగిన ఐరాస భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సీ) ప్రత్యేక సమావేశంలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా ఖండిరచారు. ఉక్రెయిన్‌ తన అధికార వ్యూహాలుగా పేర్కొనే ఉగ్రవాద విధానాలను బహిరంగంగానే ప్రచారం చేస్తోందన్నారు. ఉక్రెయిన్‌, దానికి సాయం అందించిన పశ్చిమదేశాలు ఈ చర్యకు పాల్పడ్డాయని, ఇది యుద్ధ నేరంగా పరిగణించే విధ్వంసక చర్య లని అన్నారు. సాయుధ దళాలను తిరిగి సమూహపరిచేందుకు వీలుగా ఉక్రెయిన్‌ ఈ విధ్వంసక చర్యల ద్వారా అనుకూల పరిస్థితులను సృష్టించుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఇది ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్‌ భూభాగానికి, జనాభాకు నష్టాన్ని కలిగించాలన్న లక్ష్యంతోనే జరిగిందని దుయ్యబట్టారు. కఖోవ్కా జలవిద్యుత్‌ కేంద్రాన్ని ధ్వంసం చేయాలనే ఉక్రెయిన్‌ ప్రణాళికల గురించి అంతర్జాతీయ సమాజాన్ని, ఐరాసను రష్యా గతంలో హెచ్చరించిందని నెబెంజియా అన్నారు. రష్యా దళాలు డ్యామ్‌ను ధ్వంస చేశాయని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపణలను తిప్పికొట్టారు. ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని వాసిలీ నెబెంజియా వెల్లడిరచారు.
24 గ్రామాలు మునక
తాజా ఘటనతో 24 గ్రామాలు నీటమునిగాయి. డ్యామ్‌పై దాడితో వరదలు సంభవించగా నోవా కఖోవ్కా చుట్టుపక్కల 42వేల మందికి ముంపుకు గురికాగా 17వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనిపై అమెరికా స్పందిస్తూ భారీగా ప్రాణ నష్టం జరగవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే ఖేర్సన్‌తో పాటు రష్యా ఆధీనంలోని భూభాగాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. నోవా కఖోవ్కా మేయర్‌ వ్లాదిమిర్‌ లియోన్టీవ్‌ స్పందిస్తూ ఏడుగురి ఆచూకీ లేదని చెప్పారు. కఖోవ్కా దిబ్రోవా జంతు ప్రదర్శనశాల నీట మునగగా అందులోని మొత్తం 300 జంతువులు చనిపోయాయి. ఈ మేరకు జంతు ప్రదర్శనశాల ప్రతినిధి ఒకరు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img