Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉత్తర కొరియాలో ‘స్టేట్‌ సీక్రెట్‌’ చట్టం

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియాలో గోప్యతా పరిరక్షణ చట్టానికి ఆమోదం లభించింది. జాతీయ భద్రత, సోషలిస్టు వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి ‘స్టేట్‌ సీక్రెట్‌’ పరిరక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ( కేసీఎన్‌ఏ) శుక్రవారం నివేదించింది. ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడిరచలేదు. ఈ చట్టం క్రమంలో ఒక్క రహస్యమా లేక బహుళ రహస్యాలను కాపాడతారా అన్న స్పష్టతలేదు. ఉత్తర కొరియాలో దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్ల మధ్య దేశ నియంత్రణ`క్రమశిక్షణ కట్టుదిట్టం చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకు వచ్చినట్లు పరిశీలకుల అభిప్రాయమంటూ యోన్‌హాప్‌ వార్తాసంస్థ పేర్కొంది. అయితే ఉత్తర కొరియా ప్లీనరీ సమావేశంలో సోషలిస్టు చట్టం, పరిశీలన దిక్సూచి కమిటీలను అన్ని స్థాయిల్లో ఏర్పాటు చేయడం ద్వారా చట్టం అమలు సక్రమంగా జరిగే విధంగా చర్చ జరిగినట్లు కేసీఎన్‌ఏ వెల్లడిరచింది. స్టేట్‌ సీక్రెట్‌తో పాటుగా రైల్వే నిర్వహణ, రుణాలు, జాతీయ చిహ్నాలు తదితర చట్టాలకూ సమావేశం ఆమోదం తెలిపినట్లు వార్తానివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img