Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉద్యోగాలు వదిలేసి వ్యాపారాల వైపు చూపు..!

వాషింగ్టన్‌ : ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాల్లో వివిధ మార్పులు వచ్చాయి. కెరీర్‌లో ఎదిగేందుకు నూతన మార్గాలు ఆన్వేషిస్తున్నారు. ఇందుకోసం ఉన్న ఉద్యోగాలను వదిలేస్తూ..మంచి ఆదాయం కోసం ధైర్యం చేసి వ్యాపారాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిరచాయి. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా..సెప్టెంబరులో ఈ సంఖ్య 44లక్షలుగా నమోదైందని అమెరికా కార్మిక శాఖ వెల్లడిరచింది. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3శాతంగా నమోదైంది. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న ఉద్యోగులు తమ కంపెనీలకు గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగానికి తోడు కొత్తగా ఈ రాజీనామాల సంక్షోభం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనితో పారిశ్రామికవర్గాల్లో ఆందోళన మొదలైంది. కరోనా తరువాత ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక రంగం పుంజుకొంటోంది. కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు, ప్యాకేజీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ పని చేసేందుకు ఉద్యోగులు ముందుకు రావడం లేదు. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. సరికొత్త ఉద్యోగాలను వెతుక్కునే పనిలో పడ్డారు.
కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యో గాన్ని వదిలేస్తున్నా రు. అధిక ఆదాయం లభించే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు.ప్రస్తుతం అమెరికాలో మొత్తం గా 1.4 కోట్ల ఉద్యో గాలు అందుబాటులో ఉన్నాయి. శీతాకాల సెలవులు, క్రిస్మస్‌ సీజన్‌ ఉన్న నేపథ్యంలో అనేక సంస్థలు అదనంగా ఉద్యోగులను నియమించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img