Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎగుమతుల వృద్ధికి అవకాశం

అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నాం
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్

‌న్యూదిల్లీ : వాణిజ్య రంగంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు ‘సహేతుకమైన’ స్థాయి వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ మంగళవారం తెలిపారు. స్పష్టంగా అంతర్జాతీయ వాణిజ్యంలో మందగమనం సంకేతాలు ఉన్నాయని అన్నారు. భారతదేశం అన్ని ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, భారీ ఎగుమతిదారులతో మాట్లాడటం ద్వారా విదేశాల్లో ఉన్న భారతదేశ మిషన్‌లతో పరస్పరం సంప్రదింపులు జరపడం ద్వారా పరిణామాలను నిశితంగా గమనిస్తుందని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో ‘మన ఎగుమతులు ధరల పోటీతత్వం, నాణ్యత ఆధారంగా నిలుస్తాయి. క్షేత్ర స్థాయి పరిశీలన ఆధారంగా ఎగుమతుల అంచనాలను క్రమాంకనం చేస్తాము’ అని మంత్రి తెలిపారు. 2022-23లో 450 బిలియన్‌ డాలర్లు లేదా 500 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువుల ఎగుమతులు ఈ పరిస్థితిలో ప్రతిష్టాత్మకంగా ఉన్నామా అని అడిగినప్పుడు, మంత్రిత్వ శాఖ ప్రస్తుత సంవత్సరానికి ఇంకా తుది అంకెకు లేదా ఎగుమతి లక్ష్యానికి రాలేదని ఆయన అన్నారు. దానిపై భాగస్వామ్యులందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ‘ప్రపంచం మొత్తం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్‌ మహమ్మారి ఇంకా ముగియలేదు. ఇది అనుకూలమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించే విషయం. పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ అధిక ధరలలో ఉన్నాయి. ఆహార భద్రత ఆందోళనలు కూడా మన ముందు ఉన్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎరువుల కొరత ఉంది’ అని గోయెల్‌ అన్నారు. ‘ఈ సవాలు సమయాల్లో భారతదేశం తనను తాను నిర్మాణాత్మకంగా సిద్ధం చేసి, ఎగుమతులను విస్తరించడానికి మా ప్రాథమిక సంసిద్ధతను, సామర్థ్యాన్ని బలపరుస్తుంది. అందువల్ల గత సంవత్సరం కంటే సహేతుకమైన స్థాయి వృద్ధిని ఇంకా ఆశించవచ్చు’ అని గోయెల్‌ చెప్పారు. జూన్‌లో భారతదేశ సరుకుల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 16.78 శాతం పెరిగి 37.94 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, బంగారం, ముడి చమురు దిగుమతులు విపరీతంగా పెరగడంతో వాణిజ్య లోటు కొత్త గరిష్ఠ స్థాయి 25.63 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని ప్రభుత్వ ప్రాథమిక అంచనా. జూన్‌లో ఎగుమతి వృద్ధి మేలో 20.55 శాతం నుంచి మధ్యస్థంగా ఉంది. జూన్‌ 2021లో 48.34 శాతం నుంచి నియంత్రిచబడిరది. ‘ఈ సవాలు సమయాల్లో వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, సమ్మతి భారాన్ని తగ్గించడం, ప్రస్తుత చట్టాలను నేర రహితం చేయడం, జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్‌, సముద్ర ఉత్పత్తులు, హస్తకళలు, చేనేతలు, తోలు వస్తువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల వంటి మన సంప్రదాయ ప్రాంతాలను ప్రోత్సహించాలని చూస్తున్నాం. దీర్ఘకాలంలో ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ బలంగా ఉంటుందని మేము భావిస్తున్నాము’ అని మంత్రి వివరించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను చూస్తే, దేశీయ కరెన్సీ ఈ రోజు డాలర్‌కి వ్యతిరేకంగా ఇతర కరెన్సీల కంటే ఎక్కువగా క్షీణించలేదని ఆయన అన్నారు. ‘అందువల్ల మీరు సాపేక్ష తరుగుదలని పరిశీలిస్తే, ప్రపంచంలోని అనేక కరెన్సీలతో పోల్చితే రూపాయి వాస్తవానికి బలపడిరది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలం’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img