Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎన్నికల్లో పోటీ చేస్తా..


హైతీ అధ్యక్షుడి భార్య మార్టిన్‌

వాషింగ్టన్‌: ‘నా భర్తతో పాటే నేనూ చనిపోయాననుకున్నారు..కోలుకున్నాక ఎన్నికల్లో పోటీ చేస్తా..’ ఈ వ్యాఖ్యలు చేసింది హత్యకు గురైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్‌ మోయిజ్‌ భార్య మార్టిన్‌ మోయిజ్‌…తాజాగా న్యూయార్క్‌టైమ్స్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.. దాడిలో గాయపడ్డ మార్టిన్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను ఇంకా సజీవంగా ఉన్నానో, లేదో..తెలుసుకునేందుకు దుండగులు చేసిన ప్రయత్నాల గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు. తాను చనిపోయాననుకుని భావించి…వారు వదిలివేసినట్లు తెలిపారు. నా భర్త చుట్టూ ఎప్పుడూ 30`50 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అంతమంది ఉండగానే నా భర్తను చంపేశారు…ఆశ్చర్యకరంగా సెక్యూరిటీ గార్డుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు..వ్యవస్థే నా భర్తను పొట్టన పెట్టుకుందని మార్టిన్‌ వాపోయారు.
హత్యా సమయంలో మేం గాఢనిద్రలో ఉన్నాం..తుపాకుల మోత విని లేచాం..వెంటనే సహాయం కోసం నా భర్త భద్రతా సిబ్బందిని పిలిచారు. ఆ లోపే మా గదిలోకి చొరబడి హంతకులు కాల్పులకు తెగబడ్డారని మార్టిన్‌ పేర్కొన్నారు. ఈ ఘటనలో నా భర్త చనిపోయాడు.. తీవ్ర రక్తస్రావం.. ఊపిరాడని క్షణాలు..హంతకులు స్పానిష్‌లో మాట్లాడారని తెలిపారు. నేను కోలుకున్న తర్వాత అధ్యక్ష పదవికి పోటీచేస్తా..నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను..లేకపోతే ఈ దారుణం మళ్లీ మళ్లీ జరుగుతుందని మార్టిన్‌ ఆవేశం వెళ్లగ్రక్కారు. 53ఏళ్ల వయసున్న మోయిజ్‌ 2017లో అధికారంలోకి వచ్చారు. దేశంలో ఎన్నికల నిర్వహణలో ఆయన విఫలమయ్యారు. దీనితో అధ్యక్షుడుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్‌ ఏజన్సీలను అధ్యక్షుడుకే జవాబుదారీలా మోయిజ్‌ నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img