Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎస్తోనియా అధ్యక్షుడిగా కారిస్‌

టాలిన్‌ : ఉత్తర యూరోప్‌ దేశమైన ఎస్తోనియా నూతన అధ్యక్షుడిగా ఆలార్‌ కారిస్‌ ప్రమాణస్వీకారం చేశారు. దేశపార్లమెంటు (రిగుకొగు)లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో పదవీ విరమణ చేసిన ఎస్తోనియా అధ్యక్షుడు కల్జులైడ్‌ మాట్లాడుతూ..ఐదు సంవత్సరాలు దేశానికి సేవచేయడం తనకు గౌరవంగా అభివర్ణించారు. దేశంలోని కుటుంబాలకు అధిక విద్యుత్‌ ధరల కారణంగా ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తానని హామీఇచ్చారు. మిత్రదేశాలతో మంచి సంబంధా లను కొనసాగిస్తానన్నారు. యూరప్‌లో బలమైన దేశంగా ఎస్టోనియాను మారుస్తానని తెలిపారు.101మంది సభ్యులుగల పార్లమెంటులో జరిగిన రెండవ రౌండ్‌ ఓటింగ్‌లో అవసరమైన 72ఓట్లను సాధించడంతో కారిస్‌ ఎస్టోనియా ఐదవ అధ్యక్షుడిగాఎన్నికయ్యారు. కారిస్‌ ఎస్తోనియాలోని అతిపెద్ద నగరమైన టార్టుకి చెందినవారు. ఎస్తోనియన్‌ వర్సిటీ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌ నుండి పట్టభద్రుడయ్యారు. 1999లో ప్రొఫెసర్‌ అయ్యారు. ఆ తరువాత రెక్టర్‌ పదవినలంకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img