Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒకే సినిమాకు ఏడు ఆస్కార్లు

. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’కు అవార్డుల పంట
. ఉత్తమ చిత్రం, నటి, దర్శకుడు విభాగాల్లో ఆస్కార్‌లు కైవసం
. ఉత్తమ నటుడిగా బ్రెండన్‌ ఫ్రేజర్‌
. భారత్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌, డాక్యుమెంటరీలకు అవార్డులు

లాస్‌ ఏంజెల్స్‌: చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఎన్నడూలేని విధంగా కోలాహలంగా జరిగింది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. 95వ ఆస్కార్‌ వేడుకల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు(ఆర్‌ఆర్‌ఆర్‌)’ పాటకు ఆస్కార్‌ లభించింది. అలాగే బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సినిమా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను ఆస్కార్‌ వరించింది. ఉత్తమ నటుడిగా ది వేల్‌ చిత్రానికిగాను బ్రెండన్‌ ప్రాసెర్‌, ఉత్తమ నటిగా మిషేల్‌ యో(ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ అవార్డును కైవసం చేసుకుంది. ఈ ఒక్క చిత్రానికే ఏకంగా ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకులుగా డానియల్‌ క్వాన్‌, డానియల్‌ స్కీనెర్ట్‌లు(ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) పురస్కారం గెల్చుకున్నారు. వివిధ విభాగాల్లో ది వేల్‌, బ్లాక్‌ పాంథర్‌, టాప్‌గన్‌: మావెరిక్‌, అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ వంటి చిత్రాలు ఎక్కువ అవార్డులు ఆశించినప్పటికీ, అవి ఒక్కొక్క అవార్డుకే పరిమితమయ్యాయి.

ఆస్కార్‌ విజేతలు వీరే
ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ఉత్తమ దర్శకుడు: డానియల్‌ క్వాన్‌, డానియల్‌ స్కీనెర్ట్‌
(ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ది వేల్‌)
ఉత్తమ నటి: మిచెల్‌ యోప్‌ా (ఎవ్రీథింగ్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సహాయ నటుడు: కే హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: ఉమెన్‌ టాకింగ్‌
ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: గిల్లెర్మో డెల్‌ టోరోస్‌ పినోచియో
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌: ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: నావల్నీ
ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌: యాన్‌ ఐరిష్‌ గుడ్‌బై
ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఉత్తమ మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌: ది వేల్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: బ్లాక్‌ పాంథర్‌: వకాండ ఫరెవర్‌
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌: ది బాయ్‌, ది మోల్‌, ది ఫాక్స్‌ అండ్‌ ది హార్స్‌
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
ఉత్తమ సంగీతం (ఒరిజినల్‌ స్కోర్‌): వోల్కర్‌ బెర్టెల్‌మాన్‌
(ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
ఉత్తమ సౌండ్‌: టాప్‌గన్‌: మావెరిక్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img