Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఒబామాతో సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం

రష్యా: ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికాతో సహా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో సహా 500 మంది అమెరికాన్లపై రష్యా తాజాగా ఆంక్షలు విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించినట్లు సీఎన్‌ఎన్‌ శనివారం నివేదించింది. ఈ జాబితాలో 45మంది యూఎస్‌ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు ఉన్నారు. ఏయే కారణాలతో నిషేధం విధించారన్నది రష్యా వెల్లడిరచలేదు. రష్యా విడుదల చేసిన జాబితాలో ఒబామాతో పాటు అమెరికా మాజీ రాయబారి జాన్‌ హన్ట్స్‌మాన్‌, యూఎస్‌ సెనేటర్లు, జాయింట్‌ చీఫ్స్‌ తదుపరి చైర్మన్‌ చార్లెస్‌ క్యూ బ్రౌన్‌ జూనియన్‌, టీవీ వ్యాఖ్యతలు జిమ్మీ కిమ్మల్‌, కాల్బర్ట్‌, సేత్‌ మేయర్స్‌ తదితరులున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా, రష్యా మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఎన్నడు లేని దారుణ స్థితికి చేరుకున్నాయి. అయితే తమపై ఎలాంటి దాడికైనా ప్రతిస్పందన తప్పక ఉంటుందని వాషింగ్టన్‌ ఇప్పటికైనా గ్రహించాలని రష్యా ప్రకటించింది. అదే విధంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇవాన్‌ గెర్‌ష్కోవిచ్‌కు కాన్సులర్‌ ప్రవేశానుమతి ఇవ్వాలన్న అమెరికా అభ్యర్థననూ తిరస్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img